టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న ఆయన కాన్వాయ్‌ దండుమల్కాపురం వద్ద ప్రమాదానికి గురైంది.

ఆయన కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహనానికి ఆవు అడ్డురావడంతో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశారు. దీంతో వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. వాహనం మొరాయించడంతో 15 నిమిషాల పాటు చంద్రబాబు రోడ్డుపైనే ఆగిపోయారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం శ్రేణులు ఉలిక్కిపడ్డాయి.

"