టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాడేపల్లి సిట్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. మార్గమధ్యంలో టీడీపీ శ్రేణులు అడ్డుకున్నప్పటికీ.. వాటిని క్లియర్ చేసుకుంటూ సాయంత్రం 5.10కి తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి చంద్రబాబు కాన్వాయ్ చేరుకుంది. 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాడేపల్లి సిట్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ఆయనను నంద్యాలలో అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు శనివారం ఉదయం 8 గంటలకు అక్కడి నుంచి తరలించారు. మార్గమధ్యంలో టీడీపీ శ్రేణులు అడ్డుకున్నప్పటికీ.. వాటిని క్లియర్ చేసుకుంటూ సాయంత్రం 5.10కి తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి చంద్రబాబు కాన్వాయ్ చేరుకుంది. ఆయన రాకకు ముందే ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మరోవైపు టీడీపీ కార్యకర్తలు, నేతలు కూడా సీఐడీ కార్యాలయానికి భారీగా చేరుకుంటున్నారు.

ALso Read: చంద్రబాబు కోసం రంగంలోకి సిద్ధార్థ లూథ్రా.. ప్రత్యేక విమానంలో విజయవాడకు..

అనంతరం చంద్రబాబును విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. విజయవాడ చేరుకున్న అనంతరం చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. చంద్రబాబు తరఫును సుప్రీం కోర్టు న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించనున్నారు. ఇందుకోసం సిద్దార్థ లూథ్రా ఇప్పటికే ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.

మరోవైపు ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు. చంద్రబాబును రిమాండ్‌కు ఇవ్వాల్సిందిగా కోరనున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి సీఐడీ సమర్పించిన ఆధారాలు, ఇరువైపుల వాదనల అనంతరం.. చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయాలా? వద్దా? అనే దానిపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నిర్ణయం తీసుకోనున్నారు.