Asianet News TeluguAsianet News Telugu

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం : ముగిసిన చంద్రబాబు తొలి రోజు సీఐడీ విచారణ

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తొలిరోజు సీఐడీ విచారణ ముగిసింది. సెంట్రల్ జైల్ కాన్ఫరెన్స్ హాలులో చంద్రబాబును విచారించారు సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలోని అధికారులు. 

tdp chief chandrababu naidu cid inquiry end in ap skill development ksp
Author
First Published Sep 23, 2023, 5:52 PM IST

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తొలిరోజు సీఐడీ విచారణ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు కోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో విచారణ పూర్తి చేశారు అధికారులు. మరోవైపు సెంట్రల్ జైలు దగ్గర పోలీసులు అలర్ట్ అయ్యారు. విచారణ అనంతరం సెంట్రల్ జైలు నుంచి గెస్ట్‌హౌస్‌కు వెళ్లనుంది సీఐడీ బృందం. చంద్రబాబు ఇచ్చిన సమాధానాలను వీడియో రికార్డింగ్ చేశారు అధికారులు. సెంట్రల్ జైల్ కాన్ఫరెన్స్ హాలులో చంద్రబాబును విచారించారు సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలోని అధికారులు. 

కోర్ట్ ఆదేశాల మేరకు విచారణ అంశాలు బయటకు రాకుండా జైలు అధికారులు భద్రతను ఏర్పాటు చేశారు.లంచ్ బ్రేక్‌కి ముందు ఫస్ట్ సెషన్‌లో రెండున్నర గంటల పాటు చంద్రబాబును ప్రశ్నించారు సీఐడీ అధికారులు. చంద్రబాబును రెండ్రోజుల పాటు సీఐడీ కస్టడీకి అనుమతించింది ఏసీబీ కోర్ట్. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చంద్రబాబు కస్టడీ కొనసాగుతుంది. కస్టడీలోకి తీసుకునే ముందు ఆ తర్వాత చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఆ ప్రకారమే ఇవాళ విచారణకు ముందు వైద్య పరీక్షలు చేశారు. విచారణ సమయంలో ప్రతి గంటకు ఐదు నిమిషాలు బ్రేక్ ఇస్తున్నారు సీఐడీ అధికారులు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios