ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దాని కట్టడికి పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ఉపాధి కోల్పోయే వారికి అండగా ఉండాలని చంద్రబాబు కోరారు. రెండు నెలలకు సరిపడా ప్రజలకు రేషన్ ఇవ్వాలని, ప్రతి కుటుంబానికి రూ.5 వేలు ఆర్ధిక సాయం చేయాలని ప్రతిపక్షనేత కోరారు. ఇదే సమయంలో కూరగాయల ధరలు పెరగకుండా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.