ఏపీలో పొత్తులపై చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్
రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఇతర పార్టీలతో పొత్తులంటాయని టీడీపీ చీప్ చంద్రబాబు నాయుడు చెప్పారు. శుక్రవారం నాడు ఆయన కుప్పంలో మీడియాతో మాట్లాడారు.
కుప్పం: రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఇతర పార్టీలతో పొత్తులుంటాయని Tdp చీఫ్ Chandrababu చెప్పారు. రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిస్థితుల నేపథ్యంలో అన్ని పార్టీలు ycpకి వ్యతిరేకంగా కలవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడారు. పొత్తుల గురించి ఇప్పటికిప్పుడు ఇప్పుడే మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. కుప్పంలో తమ పార్టీ కార్యకర్త జనసేనతో పొత్తు గురించి సభలో చేసిన ప్రస్తావించగానే తాను వన్ సైడ్ లవ్ గురించి వ్యాఖ్యానించానని చంద్రబాబు మీడియాకు చెప్పారు. పొత్తులపై రెండు వైపుల సమ్మతం ఉండాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అదే విషయాన్ని తాను నిన్న సభలో చెప్పానన్నారు.
పొత్తుల గురించి వైసీపీ నేతలు పిచ్చి పిచ్చిగా మాట్లాడతున్నారన్నారు. తమ పార్టీ ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకొన్న సమయంలో అధికారంలోకి వచ్చిందన్నారు. అదే సమయంలో పొత్తులున్న సమయంలో కూడా అధికారాన్ని కోల్పోయామని కూడా చంద్రబాబు గుర్తు చేశారు.
వైసీపీ వాళ్లు కొత్త బిచ్చగాళ్ల మాదిరిగా మాట్లాడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని చంద్రబాబు వైసీపీపై మండిపడ్డారు. ఒక్క అవకాశమే చివరి అవకాశంగా వైసీపీకి మారనుందని చంద్రబాబు చెప్పారు. వైసీపీ నేతలకు ప్రజలే బుద్ది చెబుతారన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులపై ఇటీవల కాలంలో మరోసారి చర్చ తెరమీదికి వచ్చింది. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, లెఫ్ట్ పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అహ్మద్ షరీఫ్ ఇటీవల ప్రకటించారు. బీజేపీతో జనసేన మధ్య పొత్తు ఉంది. కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికలకు జనసేన దూరంగా ఉంది. ఈ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసింది. బీజేపీకి జనసేన దూరమైందా అనే చర్చ కూడా సాగింది. అయితే రెండు పార్టీల మైత్రి ఉందని కూడా బీజేపీ ప్రకటించింది. అయితే రెండు పార్టీలు ఉమ్మడిగా కార్యక్రమాలు నిర్వహించిన సందర్భాలు ఇటీవల లేవు. దీంతో టీడీపీకి జనసేన దగ్గర అవుతుందనే ప్రచారం కూడా సాగింది.
జనసేనతో పాటు లెఫ్ట్ పార్టీలతో కలిసి వచ్చే ఎన్నికల్లో టీడీపీ కలిసి పనిచేసే అవకాశం ఉందని టీడీపీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. అయితే ఈ విషయమై ఆయా పార్టీల నుండి స్పష్టత రావాల్సి ఉంది. సీపీఐ మాత్రం ప్రస్తుతం టీడీపీతో కలిసి పనిచేస్తోంది. కొన్ని ఆందోళన కార్యక్రమాల్లో సీపీఐ నేతలు టీడీపీతో కలిసి పనిచేస్తోంది. కానీ సీపీఎం మాత్రం స్వతంత్రంగా కార్యక్రమాలు చేపట్టింది.
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కొత్త కూటమి ఏర్పడే అవకాశాలు అప్పటి రాజకీయ పరిస్థితుల ఆధారంగా ఉంటాయని చెబుతూనే రాష్ట్ర అవసరాల కోసం అన్ని పార్టీలు కలిసి రావాలని చంద్రబాబు కోరారు.అయితే వచ్చే ఎన్నికల నాటికి ఇతర పార్టీలతో పొత్తులుంటాయనే ప్రచారం కూడా టీడీపీ వర్గాల్లో ఉంది. అయితే ఏ పార్టీలు టీడీపీతో కలిసి వచ్చే అవకాశం ఉందనే విషయాన్ని ఇప్పటికిప్పుడే చెప్పలేమని కూడా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.