మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మండిపడ్డారు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు. చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతల గృహ నిర్బంధాన్ని ఆయన ఖండించారు. తమ పార్టీ నేతలు ఒత్తిడి చేయడం వల్లే ప్రతాప్ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారని వెల్లడించారు.

పార్టీ నాయకులతో శనివారం టెలీ కాన్ఫ్‌రెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. మృతుడి సెల్‌ఫోన్ లాక్కోవడం, శవపరీక్ష జరపడం, హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించడాన్ని ఆయన తప్పుబట్టారు.

Also Read:నూతన్ నాయుడి ఇంట్లో శిరోముండనం: బాధితుడి వేదన ఇదీ... (వీడియో)

ఈ కేసులో కీలకమైన మృతుడి కాల్‌లిస్టును బయటపెట్టాలని ప్రతిపక్షనేత డిమాండ్ చేశారు. చౌటుపల్లిలో మరో ఎస్సీ యువకుడి ప్రాణాలు తీసి ట్రాక్టర్ బోల్తాపడి మరణించినట్లుగా చిత్రీకరించారని చంద్రబాబు ఆరోపించారు.

చిత్తూరులో దళితులపై దమనకాండకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలే కారణమని ఎద్దేవా చేశారు. మూడు నెలల్లో రెండు శిరోముండనం ఘటనలు మానవత్వానికే సిగ్గు చేటని విమర్శించారు. ఈ ఘటనలకు ముఖ్యమంత్రి జగన్ బాధ్యత వహించాలని బాబు డిమాండ్ చేశారు.