విశాఖపట్నం: తనపై కావాలనే మొబైల్ దొంగతనం మోపి చిత్రహింసలు పెట్టారని సినీ నిర్మాత నూతన్ నాయుడు ఇంట్లో జరిగిన శిరోముండనం సంఘటన బాధితుడు చెప్పాడు. ఫోన్ పోయిందని తనను రాత్రి పిలిపించారని, ఆ తర్వాత తీవ్రంగా కొట్టి గుండు గీయించారని ఆయన చెప్పాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసులు నమోదు చేసినట్లు పోలీసు కమిషనర్ మహేష్ కుమార్ సిన్హా చెప్పారు. సీసీటీవీ ఫుటేజీని మీడియా సమావేశంలో ప్రదర్శించారు. 

నూతన్ నాయుడి భార్య మధుప్రియపైతో పాటు ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మధుప్రియ, ఇందిర, ఝాన్సీ, సౌజన్య, రవి, బాలు, వరహాలులపై కేసు నమోదైనట్లు తెలిపారు. కొన్ని దృశ్యాలను సీసీటీవీ నుంచి తొలగించినట్లు కనిపిస్తోందని ఆయన అన్నారు. 

సీపీ ఏం చెప్పారో, బాధితుడి ఏం చెప్పాడో ఈ కింది వీడియోలో చూడండి...

 

"