ఏపీ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి దశ పోలింగ్ ముగిసి కౌంటింగ్ ప్రారంభమైంది. ఈ క్రమంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో టీడీపీ అభ్యర్ధి విజయం సాధించారు.

ఇక్కడ తెలుగుదేశం పార్టీకి 1,827, వైసీపీకి 157 ఓట్లు వచ్చాయి. దాదాపు 40 ఏళ్ల తర్వాత నిమ్మాడలో టీడీపీ గెలుపొందం విశేషం. 

పంచాయతీ ఎన్నికల సందర్భంగా నిమ్మాడలో అచ్చెన్నాయుడి కుటుంబం 40 సంవత్సరాలుగా ఏకగ్రీవంగా గెలుస్తూ వస్తోంది. కింజరాపు కుటుంబ సభ్యులు, బంధువులు సర్పంచ్‌గా ఎన్నికవుతూ వస్తున్నారు.

Also Read:ముగిసిన పంచాయితీ ఎన్నికల పోలింగ్...82శాతం ఓటింగ్... కొద్దిసేపట్లో ఫలితాలు

ఈ ఆనవాయితీకి ఈ సారి బ్రేక్ పడింది. వైఎస్సార్సీపీ తరఫున కింజరాపు కుటుంబానికే చెందిన అప్పన్న నామినేషన్ వేయడంతో పోటీ అనివార్యమైంది. తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిపై కింజరాపు అప్పన్న నామినేషన్ వేశారు.

ఆయన నామినేషన్ వేయడాన్ని అడ్డుకోవడంలో భాగంగా బెదిరింపులకు పాల్పడ్డారనే కారణంతో అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనకు బెయిల్ లభించింది.