మొదటి దశ పంచాయితీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 82శాతం పోలింగ్ నమోదయ్యింది. 

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లో ఇవాళ(మంగళవారం) ఉదయం ప్రారంభమైన మొదటిదశ పంచాయితీ ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 82శాతం పోలింగ్ నమోదయ్యింది. అయితే సమయం ముగిసినా, క్యూలైన్ లో ఉన్న ఓటర్లకు ఓటు వేసేందుకు ఎన్నికల అధికారులు అనుమతిచ్చారు. 

4 గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఓట్ల లెక్కింపు కోసం 14,535 మంది సూపర్ వైజర్లు, 37,750 కౌంటింగ్ సిబ్బంది సిద్దమవుతున్నారు. రాత్రి 8 గంటలకల్లా దాదాపు అన్ని పంచాయితీల్లో ఫలితాలను ప్రకటించినున్నారు ఎన్నికల అధికారులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు.

పోలింగ్ ముగియడంతో ఒక్కోటిగా ఫలితాలు కూడా వెలువడుతున్నారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో అత్యధికంగా వైసిపి బలపర్చిన అభ్యర్థులే గెలుపొందుతున్నారు. ఫలితాలు వెలువడిన అనంతరమే ఉప సర్పంచ్ ను ఎన్నిక కూడా జరగనుంది.