భూమా నామినేషన్ కార్యక్రమంలో భారీ ర్యాలీ తీసారు. సుమారు 10 వేలమంది వరకూ ర్యాలీలో పాల్గొని ఉండవచ్చన్నది అంచనా.

టిడిపి అభ్యర్ధిగా భూమా బ్రహ్మానందరెడ్డి ఈరోజు నామినేషన్ వేసారు. షెడ్యూల్ ప్రకటించింది ఇటీవలే అయినా అభ్యర్ధి హోదాలో భూమా దాదాపు రెండు నెలల నుండే ప్రచారం చేసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. భూమా నామినేషన్ కార్యక్రమంలో భారీ ర్యాలీ తీసారు. సుమారు 10 వేలమంది వరకూ ర్యాలీలో పాల్గొని ఉండవచ్చన్నది అంచనా. అభ్యర్ధితో పాటు మంత్రి, సోదరి భూమా అఖిలప్రియ, ఉపముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి, అమరనాధరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాలువ శ్రీనివాసులు, ఏవి సుబ్బారెడ్డి ఎంఎల్సీ ఫరూక్ తదితరులు పాల్గొన్నారు.