ఈ దసరాకు 'జగనాసుర దహనం' చేద్దాం..: నారా లోకేష్ పిలుపు

టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా దసరా పండగరోజు వినూత్న నిరసన చేపట్టాలని నారా లోకేష్ పిలుపునిచ్చారు.

TDP Calls For Protest in Vijayadashami AKP

అమరావతి : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు నిరసనగా ఇప్పటికే టిడిపి శ్రేణులు వివిధ రకాల ఆందోళనలు చేపట్టారు. చంద్రబాబును వైసిపి ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కక్షగట్టాడని... అందుకోసమే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయించాడని ప్రజలకు వివరించేందుకు మరిన్ని నిరసన కార్యక్రమాలకు సిద్దమయ్యింది. వినూత్న నిరసనలు చేపడుతూ వీలైనంత ఎక్కువమంది ఇందులో పాల్గొనే ఏర్పాట్లు చేస్తోంది. ఇలా దసరా పండగపూట కూడా ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తూ సీఎం జగన్ కు వ్యతిరేకంగా నిరసనలు తెలపాలని టిడిపి శ్రేణులకు పిలుపునిచ్చాడు నారా లోకేష్. 

ఇటీవల గాంధీ జయంతి రోజున సత్యమేవ జయతే పేరిట ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టినట్లు దసరా పండగ పూట కూడా నిరసనలు సిద్దమవుతోంది టిడిపి. దసరా రోజున రావణదహనం చేయడం సాంప్రదాయం...  కానీ ఈసారి జగనాసుర దహనం కూడా చేయాలని టిడిపి నిర్ణయించింది.  ''దేశం చేస్తోంది రావణాసుర దహనం - మనం చేద్దాం జగనాసుర దహనం'' పేరిట నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చంద్రబాబు తనయుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. 

దసరా పండగరోజున అంటే అక్టోబర్ 23న రాత్రి 7 గంటల నుండి 7.05 నిమిషాల వరకు టిడిపి శ్రేణులు వీధుల్లోకి రావాలని లోకేష్ సూచించారు. 'సైకో పోవాలి' అన్ని నినాదాలు రాసిన పత్రాలను చేతబట్టి వైఎస్ జగన్, వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయాలని సూచించారు. అనంతరం ఆ పత్రాలను దహనం చేయాలన్నారు. ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేయాలని లోకేష్ సూచించారు. 

Read More చంద్రబాబుకు అధికారం ఉంటే క్యాష్ పిటిషన్.. అవినీతి చేస్తే క్వాష్ పిటిషన్: జోగి రమేష్

జగన్ అనే రాక్షసుడు చెడుకు సూచికగా వుంటే... చంద్రబాబు నాయుడు మంచికి సూచికగా వున్నారన్నారు. కాబట్టి తాత్కలికంగా చెడుదే ఆధిక్యంగా కనిపించినా చివరకు గెలిచేది మంచేనని... ఇదే దసరా పండగ సందేశమని లోకేష్ అన్నారు. కాబట్టి జగన్ పై కూడా చంద్రబాబు విజయం సాధిస్తుందని... ముందుగానే పండగని సెలబ్రేట్ చేసుకుందామని నారా లోకేష్ అన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios