శ్రీకాకుళం: టీడీపీ  ఏపీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావును బుధవారం నాడు ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కారుపై దాడి ఘటనలో కళా వెంకట్రావును అరెస్ట్ చేశారు.

విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో  రాముడి విగ్రహాం ధ్వంసం ప్రాంతాన్ని పరిశీలించేందుకు ఈ నెల 2వ తేదీన చంద్రబాబునాయుడు, విజయసాయిరెడ్డిలు వేర్వేరుగా వెళ్లారు.తొలుత విజయసాయిరెడ్డి ఆలయం వద్ద సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి వెళ్లే సమయంలో ఆయన కారుపై దాడి జరిగింది. 

also read:కారుపై దాడి: చంద్రబాబు, అచ్చెన్నాయుడిపై విజయసాయిరెడ్డి ఫిర్యాదు

ఈ ఘటనపై విజయసాయిరెడ్డి  ఈ నెల 3వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబునాయుడు,, అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావుల డైరెక్షన్ లోనే ఈ దాడి జరిగిందని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు  కేసు నమోదు చేశారు. ఈ కేసులో బుధవారం నాడు రాత్రి రాజాంలో మాజీ మంత్రి కళా వెంకట్రావును పోలీసులు అరెస్ట్ చేశారు.రాజాంలో కళా వెంకట్రావు అరెస్ట్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకుగాను పోలీసులు భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు.