బీజేపీ తో టీడీపీ, వైసీపీ కుమ్మక్కు - వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
బీజేపీ (AP BJP) తో ఏపీలోని టీడీపీ (Teludu desham party), వైసీపీ (YCP) దోస్తీ చేస్తున్నాయని ఏపీసీసీ చీఫ్ వైఎస్ శర్మిల (APCC Chief YS Sharmila) ఆరోపించారు. ఈ మూడు పార్టీలు కుమ్మక్కు అయ్యాయని అన్నారు. బీజేపీ తొత్తులుగా ఉన్న ఆ రెండు పార్టీలను ఓడగొట్టాలని ఆమె పిలుపునిచ్చారు.
కేంద్రంలోని అధికార బీజేపీతో తెలుగుదేశం పార్టీ, వైసీపీలు కుమ్మకు అయ్యాయని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పారు. విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు. టీడీపీ చీఫ్ చంద్రబాబువి కనిపించే పొత్తులని, వైసీపీవి కనిపించని పొత్తులని ఎద్దేవా చేశారు. తనకు ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానని వైఎస్ జగన్ అన్నారని, కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే దానిని మర్చిపోయారని తెలిపారు.
అస్సాం సీఎం పగ్గాలు అమిత్ షా చేతిలో.. హిమంత శర్మ అత్యంత అవినీతిపరుడు - రాహుల్ గాంధీ
ప్రత్యేక హోదా కోసం ఏపీ సీఎం జగన్ ఒక్క రోజు కూడా ఉద్యమం చేయలేదని వైఎస్ షర్మిల విమర్శించారు. ఉత్తరాంధ్రను రెండు పార్టీలు మోసం చేశాయని ఆరోపించారు. ఇక్కడ ఉన్న కంపెనీలను ప్రైవేట్ కి అప్పనంగా అప్పగిస్తున్నారని మండిపడ్డారు. గంగవరం పోర్టు ను తక్కువ ధరకు అదానీకి అమ్మేశారని ఆమె ఆరోపించారు. 30 ఏళ్ల లీజు తర్వాత గంగవరం పోర్ట్ ప్రభుత్వ పరం కావాల్సి ఉందని అన్నారు. నిబంధనలను తుంగలో తొక్కి ప్రభుత్వ వాటా 10 శాతం అగ్గువకే అమ్మేశారని అన్నారు.
గాంధీ వల్ల స్వతంత్రం రాలేదు - తమిళనాడు గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడం కూడా ఒక కుట్ర అని వైఎస్ షర్మిల అన్నారు. ఇందిరమ్మ హయాంలో ఏర్పడిన విశాఖ స్టీల్ ను అమ్మే ప్రయత్నం చేస్తున్నారని ఆమె విమర్శించారు. 3 టన్నులుగా ఉన్న ఉత్పత్తిని వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో 7 మిలియన్ టన్నుల ఉత్పత్తి కి పెంచారని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు నష్టాల సాకు చూపి ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ నిర్ణయంతో 30 వేల మంది కార్మికులను రోడ్డున పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రూ.2, రూ.5 కాయిన్లు ఉంటే లక్షాధికారులు.. సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏం చెప్పిందంటే..?
తన తండ్రి సీఎంగా ఉన్నప్పుడు నష్టాల్లో ఉన్న కంపెనీలను కేంద్ర ప్రభుత్వ కంపెనీలలో విలీనం చేశారని ఏపీసీసీ చీఫ్ శర్మిల అన్నారు. విశాఖకి రైల్వే జోన్ ఇచ్చారని, అది ఇంకా అమలు కాలేదని చెప్పారు. మెట్రో రైల్ ప్రాజెక్టు పత్తా కూడా లేదని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు అనుకున్నవన్నీ జరిగాయని అన్నారు. అందుకే మళ్లీ రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో రావాలని అకాంక్షించారు. బీజేపీ తొత్తులుగా ఉన్న వైసీపీ, టీడీపీ లను ఓడగొట్టాలని పిలుపునిచ్చారు.