గాంధీ వల్ల స్వతంత్రం రాలేదు - తమిళనాడు గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు
గాంధీ వల్ల భారతదేశానికి స్వాతంత్ర్యం రాలేదని (India did not get independence because of Gandhi) తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి (Tamil Nadu Governor RN Ravi) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ( Netaji Subhas Chandra Bose) పోరాటం వల్ల బ్రిటిషర్లు మన దేశం వదలి వెళ్లిపోయారని చెప్పారు.
భారతదేశానికి స్వాతంత్ర్యం అందించిన ఘనత నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు దక్కుతుందని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి అన్నారు. బ్రిటీష్ వారిన మనం దేశం నుంచి తరమికొట్టింది సుభాష్ చంద్రబోస్ అని తెలిపారు. కానీ కాంగ్రెస్, మహాత్మా గాంధీ వల్ల దేశానికి స్వాతంత్ర్యం రాలేదని చెప్పారు. చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో నేతాజీ 127వ జయంతి కార్యక్రమంలో గవర్నర్ పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.
మోడీ అంత కఠిన ఉపవాసం చేశారంటే నాకు డౌటే- కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ వివాదాస్పద వ్యాఖ్యలు
మహాత్మాగాంధీ సహాయ నిరాకరణోద్యమం పెద్దగా ప్రభావం చూపలేదని, అయితే నేతాజీ సుభాష్ చంద్రబోస్ సైనిక ప్రతిఘటనే బ్రిటిషర్లు భారతదేశం నుంచి నిష్క్రమించడానికి దారితీసిందని అన్నారు. 1942 తర్వాత గాంధీ నాయకత్వంలోని జాతీయ స్వాతంత్య్ర ఉద్యమం పెద్దగా ప్రభావం చూపలేదని అన్నారు. ఈ విషయాన్ని అట్లీ (భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చే నిర్ణయంపై సంతకం చేసిన బ్రిటిష్ మాజీ ప్రధాని క్లెమెంట్ అట్లీ) అంగీకరించారని రవి అన్నారు.
‘‘నేతాజీ లేకుంటే 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేది కాదు. ఎందుకంటే భారత జాతీయ కాంగ్రెస్ సహాయ నిరాకరణ ఉద్యమం విఫలమైంది, అయితే 1942 తర్వాత జాతీయ స్వాతంత్ర్య ఉద్యమం జరిగింది. మహాత్మా గాంధీ నాయకత్వం ప్రభావవంతంగా లేదు. మరోవైపు, మహమ్మద్ అలీ జిన్నా నేతృత్వంలోని ముస్లిం లీగ్ ప్రత్యేక దేశం కోసం పోరాడుతోంది. ’’ అని రవి తెలిపారు.
రూ.2, రూ.5 కాయిన్లు ఉంటే లక్షాధికారులు.. సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏం చెప్పిందంటే..?
ఆ సమయంలో బ్రిటీష్ వారికి భారత్ లో ఎలాంటి సమస్య లేదని, వారు చాలా సంవత్సరాలు కొనసాగేవారని గవర్నర్ అన్నారు. కానీ నేతాజీ ప్రవాసంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్నారు. సమర్థుడైన కమాండర్ నేతృత్వంలోని సైన్యం మద్దతుతో ఆజాద్ హింద్ సర్కార్ క్షేత్రస్థాయిలో బ్రిటీష్ వారితో పోరాడి, వారి కోటలోని అనేక ప్రాంతాల్లో బ్రిటీష్ వారిని ఓడించిందని చెప్పారు.
బ్రిటిష్ నావికాదళంలోని భారతీయులు 1946లో తిరుగుబాటు చేసి 20 యుద్ధనౌకలను తమ ఆధీనంలోకి తీసుకున్నారని, రాయల్ నేవీని స్తంభింపజేశారని ఆయన అన్నారు. నేతాజీ స్ఫూర్తితో భారత వైమానిక దళంలోని భారతీయులు సమ్మెకు దిగారని ఆయన అన్నారు. స్వాతంత్య్రం ఇచ్చినందుకు భారత్ నేతాజీకి ఎంతో రుణపడి ఉందని చెప్పడం అతిశయోక్తి కాదని అన్నారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా నేతాజీపై సమగ్ర పరిశోధన జరగాలని గవర్నర్ ఆర్ఎన్ రవి పిలుపునిచ్చారు.