బెయిల్ రద్దై జగన్ మళ్ళీ జైలుకు వెళ్లాలని టిడిపి నేతలు కోరుకుంటున్నారు. జగన్ గనుక మళ్లీ జైలుకు వెళితే తమకు ఇంకెక్కడా ఎదురేలేదని టిడిపి నేతలు అనుకుంటున్నారు. అదే సమయంలో తమ అధినేత బైల్ రద్దు కాకూడదని వైసీపీ కోరుకుంటోంది.

జగన్ అక్రమాస్తుల కేసుల్లో బెయిల్ రద్దుపై రాజకీయ పార్టీల్లో టెన్షన్ పెరిగిపోతోంది. జగన్కు బైల్ రద్దవుతుందా? బెయిల్ కొనసాగుతుందా? అన్న చర్చ ఇటు టిడిపిలోను అటు వైసీపీలో జోరుగా సాగుతోంది.బెయిల్ రద్దై జగన్ మళ్ళీ జైలుకు వెళ్లాలని టిడిపి నేతలు కోరుకుంటున్నారు. జగన్ గనుక మళ్లీ జైలుకు వెళితే తమకు ఇంకెక్కడా ఎదురేలేదని టిడిపి నేతలు అనుకుంటున్నారు. కాబట్టే చంద్రబాబు మొదలు సామాన్యకార్యకర్త వరకూ జగన్ బైల్ రద్దు కావాలనే కోరుకుంటున్నారు.

అదే సమయంలో తమ అధినేత బెయిల్రద్దు కాకూడదని వైసీపీ కోరుకుంటోంది. అక్రమాస్తుల కేసులో విచారణను ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి బెయిల్ పై బయటున్న సంగతి అందరికీ తెలిసిందే కదా? ఇంతకీ బైల్ రద్దు గురించి ఇంత చర్చ ఎందుకు? విచారణను ఎదుర్కొంటున్న జగన్ బయట స్వేచ్చగా తిరిగితే సాక్షులను ప్రభావితం చేస్తాడంటూ సిబిఐ వాదించింది. అయితే, అటువంటివేమీ జరగవని జగన్ కోర్టుకు చెప్పుకున్నారు. అందుకనే జగన్ కు కోర్టు బైల్ ఇచ్చింది.

అయితే, ఇటీవలే సాక్షి టివికి ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, జగన్ కేసుల్లో విచారణకు హాజరైన రమాకాంత్ రెడ్డి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో రెడ్డి మాట్లాడుతూ, జగన్ పై పెట్టిన కేసులు నిలబడవన్నారు. సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వ మాన్యువల్ తెలీదన్నారు. ఏ కేసులోనూ జగన్ కు శిక్ష పడదన్నట్లుగా వ్యాఖ్యలు చేసారు. ఈ విషయాన్ని తాను అప్పట్లో సిబిఐకే చెప్పానని కూడా చెప్పటం వివాదాస్పదమైంది.

ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్న సిబిఐ వెంటనే రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూని కోర్టు ముందుంచింది. జగన్ కేసుల్లో విచారణకు హాజరైన రామాకాంత్ రెడ్డి కేసులు నిలబడవంటూ చెప్పటమంటే సాక్ష్యలను ప్రభావితం చేయటమేనంటూ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారు కాబట్టే జగన్ బైల్ రద్దు చేయాలంటూ వేసిన పిటీషన్ పై ఈరోజు కోర్టు తీర్పు చెబుతుంది. ఆ తీర్పు విషయంలోనే ఇటు టిడిపి అటు వైసీపీ టెన్షన్ పడుతున్నాయి.