అవును పవన్ కల్యాణ్ పరిస్ధితి అలాగే తయారైంది. తానడగిన వెంటనే కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు రెండు పరుగిత్తుకుంటూ వచ్చి లెక్కలన్నీ ఇచ్చేస్తాయని అనుకుని ఉంటారు. కానీ జరిగిందేమిటి? అటు కేంద్రంగాని ఇటు రాష్ట్రం గాని కనీస మాత్రంగా కూడా జనసేన అధ్యక్షుడు పనవ్ కల్యాణ్ ను లెక్కే చేయలేదు.

కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చిన నిధులెంత? రాష్ట్రం ఖర్చుచేసిన నిధులెంత? అని పవన్ లెక్కలడిగారు. అందుకు గురువారం అంటే ఈరోజును డెడ్ లైన్ గా ప్రకటించారు, కేంద్రమైతే పవన్ ను ఏమాత్రం పట్టించుకోలేదు. వచ్చే ఎన్నికల్లో పవన్ తో ఏమీ అవసరం లేదనుకుందమో బిజెపి? కాబట్టి ఏపిలో పవన్ కల్యాణ్ అనే ఓ సినీనటుడున్న విషయమే మరచిపోయినట్లుంది.

ఇక, చంద్రబాబు సంగతి చూద్దామా అంటే అప్పుడెప్పుడే లెక్కలడిగితేనే ఇవ్వలేదు. పైగా వెబ్ సైట్లోనే అన్నీ లెక్కలున్నాయి చూసుకోమన్నారు. వెబ్ సైట్ పనిచేయటం లేదని పవన్ అంటే ఓ పిచ్చి నవ్వు నవ్వేసి ఊరుకున్నారు. కాబట్టి ఇపుడేదో లెక్కలిచ్చేస్తారని అనుకోలేదు. పైగా ‘పవన్ మనోడే..ఏమన్నా ఆవేశంలో అన్నా ఎవరూ పట్టించుకోవద్దు’ అంటూ చంద్రబాబు నేతలకు స్పష్టంగా చెప్పారు.

సరే, పవన్ విషయం చూద్దామా అంటే శుక్రవారం రాజకీయ పార్టీల నేతలతో జనసేన కార్యాలయంలో జాయింట్ ఫ్యాక్ట్ ఫైడింగ్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. కేంద్రం ఇచ్చిన లెక్కలు లేక, రాష్ట్రం చేసిన ఖర్చుల వివరాలు లేకపోతె ఇక సమావేశంలో ఏం మాట్లాడుతారో చూడాలి. మొత్తం మీద అటు బిజెపి కానీ ఇటు టిడిపి కానీ తనను ఏమాత్రం లెక్క చేయటం లేదన్న విషయం పవన్ కు అర్ధమై మైండ్ బ్లాంక్ అయిపోయింది.