Asianet News TeluguAsianet News Telugu

రేపటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు: టీడీఎల్పీ భేటీ, వ్యూహాంపై చర్చ

ఈ నెల 16వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాంపై టీడీఎల్పీ సమావేశం సోమవారం నాడు ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం నిర్వహించారు చంద్రబాబు.

TDLP meeting begins today through video conference
Author
Amaravathi, First Published Jun 15, 2020, 11:31 AM IST

అమరావతి: ఈ నెల 16వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాంపై టీడీఎల్పీ సమావేశం సోమవారం నాడు ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం నిర్వహించారు చంద్రబాబు.

టీడీపీకి చెందిన కీలక నేతలను అరెస్ట్ చేయడంపై  ఏం చేయాలనే దానిపై కూడ ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఉద్దేశ్యపూర్వకంగానే టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని కొందరు ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు. అయితే గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించాలని మరికొందరు నేతలు సూచిస్తున్నారు.

ఈ విషయమై టీడీఎల్పీలో చర్చిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే ఏ రకమైన వ్యూహాన్ని అనుసరించాలనే దానిపై కూడ చర్చిస్తున్నారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైసీపీ అసెంబ్లీని బహిష్కరించింది. అసెంబ్లీని బహిష్కరించడంపై ఆ సమయంలో టీడీపీతో పాటు పలు పార్టీలు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.

also read:కరోనా ఎఫెక్ట్: ఏపీ అసెంబ్లీలో వారికి అనుమతి లేదు

చంద్రబాబు ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలపై అవినీతి చోటు చేసుకొందని ఈ నెల 11వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలో  కేబినెట్ సబ్ కమిటీ నివేదికను అందించింది.త్వరలోనే ఒక్కొక్కరుగా జైలు బాట పడతారని టీడీపీ నేతలను ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు చేసిన రెండు రోజుల్లోనే  టీడీపీకి చెందిన ఇద్దరు కీలక నేతలు అరెస్ట్ అయిన విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios