అమరావతి:అసెంబ్లీ సమావేశాలను పురస్కరించుకొని సందర్శకులకు అసెంబ్లీకి అనుమతి లేదని ఏపీ అసెంబ్లీ ప్రకటించింది.

ఈ నెల 16వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.  కరోనా నేపథ్యంలో  అసెంబ్లీ సమావేశాల నిర్వహణలో విషయంలో అధికారులు జాగ్రత్తలు తీసుకొంటున్నారు.

ఈ మేరకు ప్రత్యేక బులెటిన్ విడుదల చేసింది ఏపీ అసెంబ్లీ సెక్రటరీ. అసెంబ్లీలోకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్టుగా అసెంబ్లీ కార్యాలయం ప్రకటించింది. 

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పీఎస్‌, పీఏలకు అనుమతి లేదన్నారు. అసెంబ్లీలోకి విజిటర్లకు అనుమతి లేదన్నారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాల్సిందేనని  అసెంబ్లీ తెలిపింది.

అసెంబ్లీకి వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ ఆవరణలో ఎలాంటి ఆందోళనలకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. కరోనాను పురస్కరించుకొని సభ్యులంతా భౌతిక దూరం పాటించాలని సూచించారు.

అసెంబ్లీలో టీడీపీ పక్ష ఉపనేత అచ్చెన్నాయుడిని ఈఎస్ఐ స్కామ్ లో ఏసీబీ అధికారులు ఈ నెల 12న అరెస్ట్ చేశారు.  అచ్చెన్నాయుడు ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నాడు. ఈ విషయాన్ని టీడీపీ ప్రస్తావించే అవకాశం ఉంది. అయితే దీనిపై ప్రభుత్వం కూడ గట్టిగా కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది.