ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు బాగుంటున్నాయని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్ ప్రశంసించారు.
న్యూఢిల్లీ : ఏపీ సీఎం YS Jagan పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను Tamil Nadu సీఎం Stalin ప్రశంసించారు. గురువారం పార్లమెంట్ సెంట్రల్ హాల్ కు వచ్చిన వైఎస్ఆర్ సీపీ ఎంపీలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, గోరంట్ల మాధవ్, మార్గాని భరత్, విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, రెడ్డప్ప, శ్రీ కృష్ణదేవరాయలు, వంగా గీత, తలారి రంగయ్యలను డీఎంకే ఎంపీ కనిమొళి పరిచయం చేశారు. ఈ సందర్భంగా స్టాలిన్.. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మెచ్చుకున్నారు. లబ్ధిదారులకు నగదు బదిలీ చేస్తున్న సీఎం జగన్ అభినందనీయులని స్టాలిన్ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 7న ముఖ్యమంత్రి M K Stalin నివాసానికి ఫేక్ Bomb threat కాల్ చేసిన ఓ Disabledని పోలీసులు అరెస్ట్ చేశారు. 28 ఏళ్ల ఈ యువకుడిని గ్రేటర్ చెన్నై పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు. శనివారం నాడు చెన్నై పోలీస్ కంట్రోల్ రూం కు ఓ కాల్ వచ్చింది. ముఖ్యమంత్రి స్టాలిన్ నివాసంలో బాంబు పెట్టామని.. త్వరలో అది పేలుతుందని సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు Bomb Detection Squadను రంగంలోకి దించారు.
వెంటనే ముఖ్యమంత్రి నివాసంలో డిటెక్షన్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్‌లతో క్షుణ్ణంగా Searches నిర్వహించారు. రెండు గంటలపాటు బాంబు కోసం వెతికారు. అయితే ఎలాంటి ఆధారాలు, బాంబు దొరకకపోవడంతో ఆ ఫోన్ Fake Call అని గుర్తించారు. వెంటనే ఈ మేరకు ఓ ప్రకటన కూడా చేశారు. ఆ తరువాత కాల్ మీద ఆరా తీశారు. కంట్రోల్ రూంకు వచ్చిన కాల్ ఆధారంగా పోలీసులు ఆ కాల్ చెంగల్‌పేటనుంచి వచ్చినట్టుగా గుర్తించారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు నిందితుడిని తిరుపోరూర్ సమీపంలోని వడపోరుందవాక్కం గ్రామానికి చెందిన అయ్యప్పన్ (28)గా గుర్తించారు.
అయ్యప్పన్ తీవ్ర మనస్తాపంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తేలింది. రాష్ట్ర ప్రభుత్వ పథకం కింద ఇస్తామన్న ఇళ్లు ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని, అందుకే ఇలా కాల్ చేశానని పోలీసులకు తెలిపాడు. తన ఆర్థిక పరిస్థితిని, తన దుస్థితిని తెలుపుతూ ఇంటి కోసం పలుమార్లు అర్జీలు పెట్టుకున్నానని.. అయినా అధికారులు పట్టించుకోలేదన్నారు. ఈ విషయమై అధికారులను కలిసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని తెలిపాడు.
గతంలో కూడా కోయంబేడు బస్ టెర్మినస్‌లో బాంబు ఉందని ఫేక్ కాల్ చేసినట్టు పోలీసుల ఎంక్వైరీలో తేలింది. ఆ సమయంలో అతని కాల్ తో అప్రమత్తమైన పోలీసులు బస్ టెర్మినల్ లో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఆ సమయంలో కూడా అతడు బూటకపు బాంబు బెదిరింపులకు పాల్పడ్డాడని విచారణలో తేలింది. అతడిపై సీఎంబీటీ పోలీసులు గతేడాది కేసు నమోదు చేశారు. అరెస్టు చేసిన తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి నివాసంలోనే బాంబు ఉందంటూ ఫేక్ కాల్ చేయడంతో..జిల్లాలో అతడిపై మరేదైనా కేసులు ఉన్నాయా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిమీద తదుపరి విచారణ కొనసాగుతోంది.
