విజయవాడ: విశాఖ శారదా పీఠం నూతన ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి చాలా అభిమానం అని చెప్పుకొచ్చారు స్వరూపానందేంద్ర సరస్వతి.  

స్వాత్మానందేంద్ర సరస్వతి ఉత్తరాధికారిగా నియమితులవుతారని సీఎం వైయస్ జగన్ కు ముందే తెలుసునని చెప్పుకొచ్చారు. నాలుగేళ్ల క్రితమే తాను వైయస్ జగన్ తో తెలియజేశానని చెప్పుకొచ్చారు. 

స్వాత్మానందేంద్ర సరస్వతి విశాఖశారదా పీఠం నూతన ఉత్తరాధికారిగా నియమించడంపై ఆయన చాలా సంతోషం వ్యక్తం చేశారని గుర్తు చేశారు. ఇంత చిన్న వయస్సులో అంత పెద్ద బాధ్యతలు అప్పగిస్తున్నారంటూ జగన్ ప్రశంసించారంటూ స్వరూపానందేంద్ర సరస్వతి చెప్పుకొచ్చారు.

వైయస్ జగన్ అంటే తనకు ఎంతో అభిమానమని, ప్రేమ అని చెప్పుకొచ్చారు. జగన్ తో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. జగన్ ను సీఎంగా కావాలని తాను, విశాఖ శారదాపీఠం ఎంతో శ్రమించిందని స్వరూపానంద సరస్వతి చెప్పుకొచ్చారు.

ఈ వార్తలు కూడా చదవండి

జగన్ కోసం ఐదేళ్లు శ్రమించాం, ఆయన నా ఆత్మ: స్వరూపానందేంద్ర సరస్వతి