విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు స్వరూపానందేంద్ర సరస్వతి. వైయస్ జగన్ తన ఆత్మ అంటూ చెప్పుకొచ్చారు. వైయస్ జగన్ అంటే తనకు పంచ ప్రాణాలు అంటూ చెప్పుకొచ్చారు. 

వైయస్ జగన్ కోసం ఐదేళ్లు పాటు శ్రమించింది విశాఖశారదా పీఠమని చెప్పుకొచ్చారు. వైయస్ జగన్ సీఎం  కావాలని విశాఖ శారదాపీఠం యావత్తూ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని చెప్పుకొచ్చారు. 

వైయస్ జగన్ సీఎం కావాలని దేవాలయాల వ్యవస్థ బాగుపడాలని, హిందూ దేవాలయ భూములు ఆక్రమణలకు గురికాకుండా ఉండాలంటే జగన్ సీఎం కావాలని కోరుకున్నామని తెలిపారు.  విశాఖ శారదా పీఠంలో ఏ గోడను అడిగినా, ఆకును అడిగినా అదే చెప్తోందని గుర్తు చేశారు. 

మరో పదిహేను సంవత్సరాలు సీఎంగా జగన్ పనిచేయాలని ఆకాంక్షించారు. వైయస్ జగన్ కు రాజశ్యామల అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. అనంతరం విశాఖ శారదా పీఠం తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం వైయస్ జగన్ కు ముద్దుపెట్టి తన ప్రేమను పంచారు స్వరూపానందేంద్ర సరస్వతి.