మరో వివాదంలో ఎస్వీబీసీ ఛైర్మెన్ పృథ్వీ: మహిళా ఉద్యోగినికి ఐలవ్‌యూ అంటూ

ఎస్వీబీసీ చైర్మెన్ పృథ్వీరాజ్ మరో వివాదంలో ఇరుక్కొన్నారు. మహిళా ఉద్యోగినితో సరసాలు ఆడుతూ సంభాషణను కొనసాగించారు. 

SVBC Chairman pruthviraj Audio goes on viral on social media


అమరావతి: సినీనటుడు, ఎస్వీబీసీ చైర్మెన్ పృథ్వీ ఓ మహిళా ఉద్యోగినితో మాట్లాడినట్టుగా చెబుతున్న ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఆడియో సంభాషణలో మాట్లాడింది పృథ్వీయేనా లేక మరేవరైనా పృథ్వీ మాదిరిగా మాట్లాడి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారా అనే విషయం తేలాల్సి ఉంది.

also read:పోసానితో పోరు... పృథ్వీపై జగన్ సీరియస్

ఎస్వీబీసీ ఛానెల్‌లో పనిచేసే ఓ మహిళా ఉద్యోగినితో ఎస్వీబీసీ ఛైర్మెన్  పృథ్వీరాజ్ మాట్లాడిన ఫోన్‌కాల్ కలకలం రేపుతోంది. నువ్వంటే ఇష్టమని.. తన గుండెల్లో ఉన్నావని..లవ్యూ అంటూ.. ఫోన్లో ఉద్యోగినితో పృథ్వీ మాట్లాడారు. 

ప్రస్తుతం మద్యం సేవించడం మానేసిన తాను మళ్లీ తాగడమంటూ జరిగితే నీవద్దే  కూర్చొని తాగుతానంటూ ఆ ఉద్యోగినితో చెప్పాడు. అంతేకాదు ఏకంగా ఛానెల్ కార్యాలయంలోనే వెనుక నుండి వచ్చి పట్టుకుందామని అనుకొన్నామని ఎక్కడ భయపడి అరుస్తావోనని ఆగిపోయినట్టుగా ఆ ఫోన్ సంభాషణలో ఉంది. ఈ ఫోన్ సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

అమరావతిలో రైతులు చేస్తున్న ఆందోళనల విషయంలో  పృథ్వీరాజ్  తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణ మురళి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.పోసాని కృష్ణ మురళి వ్యాఖ్యలపై  పృథ్వీ కౌంటరిచ్చారు. 

ఇదిలా ఉంటే  ఎస్వీబీసీ ఛైర్మెన్ పృథ్వీ మహిళా ఉద్యోగినులను వేధింపులకు పాల్పడుతున్నారని తిరుపతిలో సీఐటీయూ నేత కందారపు మురళి చెప్పారు. ఎస్వీబీసీ ఛైర్మెన్ పృథ్వీ వేధింపుల విషయాన్ని ఓ మహిళా ఉద్యోగిని తన ఫోన్‌లో రికార్డు చేసి ఆడియో సంభాషణను బయటపెట్టింది. పృథ్వీ వేధింపులను బయటపెట్టేందుకు ఆ ఉద్యోగిని పృథ్వీతో సహకరించినట్టుగా ఆమె మాట్లాడినట్టుగా మురళి చెప్పారు.

ఎస్వీబీసీ ఛానెల్‌లో పనిచేసే మహిళా ఉద్యోగులను లైంగికంగా పృథ్వీ వేధింపులకు గురి చేశారని చెప్పారు. పద్మావతి గెస్ట్‌హౌజ్‌లోనే పృథ్వీ మద్యం సేవించేవాడని ఆయన చెప్పారు.ఎస్వీబీసీ ఛానెల్ ఛైర్మెన్ పదవి నుండి  పృథ్వీని తొలగించాలని కోరుతూ ఈ నెల 13వ తేదీన ఆందోళన చేస్తామని మురళి తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios