చంద్రబాబు ఇంటిముందు అనుమానస్పద మహిళ

First Published 5, Apr 2018, 4:22 PM IST
Suspected lady before chandrababus residence
Highlights
సీఎం ఇంటి సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం దగ్గర గురువారం ఓ మహిళ అలజడి సృష్టించింది. అమరావతిలోని ఉండవల్లిలో సీఎం ఇంటి సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు సదరు మహిళను భద్రతా సిబ్బంది అడగగా సచివాలయానికి వెళ్తున్నట్టు చెప్పింది.

అయితే ఎంతసేపైనా ఆమె సీఎం ఇంటి దగ్గరే తిరుగుతుండటంతో పోలీసులకు అనుమానం వచ్చి ప్రశ్నించారు. ఓసారి సీబీఐ అధికారినని, మరోసారి సీబీఐ అధికారి లక్ష్మీనారాయణ భార్యనంటూ పొంతనలేని సమాధానమిచ్చింది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ఆధారాలు పరిశీలించారు. ఎర్విన్‌ రీటాగా గా గుర్తించిన పోలీసులు ఆమెను తాడేపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు.

అసలే, చంద్రబాబుకు మావోయిస్టుల నుండి హెచ్చరికలందుతున్నాయ్. అందుకే ఇంటి చుట్టూ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దానికితోడు చంద్రబాబు, లోకేష్ పై త్వరలో సిబిఐ విచారణ జరుగుతుందనే ప్రచారం జరుగుతున్న విషయం కూడా తెలిసిందే. ఇటువంటి నేపధ్యంలో పొంతల లేని సమాధానాలు చెబుతున్న మహిళ విషయాన్ని పోలీసులు సీరియస్ గానే తీసుకున్నారు.

 

loader