పవన్ కంటికి సర్జరీ..?

First Published 21, Jun 2018, 1:17 PM IST
surgery for pawan kalyan eyes
Highlights

పవన్ కంటికి సర్జరీ..?

సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కంటికి సర్జరీ చేయించుకోబోతున్నారు. గత కొన్ని రోజులుగా కంటి సంబంధిత ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో సర్జరీ చేయించుకోనున్నారు.. గతంలో ఒక సినిమా వేడుకలో పాల్గొన్న పవర్ స్టార్.. తాను చలువ కళ్లద్దాలు పెట్టుకున్నది స్టైల్ కోసం  కాదని.. కంటికి సంబంధించిన సమస్యతో తాను బాధ పడుతున్నానని.. ఎక్కువ వెలుతురు చూడలేకపోతున్నానని.. అందుకే వాటిని పెట్టుకున్నానని.. దయ చేసి తప్పుగా అనుకోవద్దని అభిమానులను కోరాడు.

ప్రజా పోరాట యాత్రలో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో చేస్తోన్న యాత్రలో కూడా ఆయన ఎక్కువ శాతం కళ్లద్దాలతోనే కనిపించారు. రంజాన్ పర్వదినం సందర్భంగా యాత్రకు బ్రేక్ ఇచ్చిన పవర్ స్టార్.. ఇలోగా సర్జరీ చేయించుకోవాలని భావించారు.. కంటికి శస్త్రచికిత్స చేయించుకున్న అనంతరం తిరిగి విశాఖపట్నం జిల్లాలో ఆయన యాత్ర ప్రారంభమవుతుంది. 

loader