Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య: ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దుపై తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా  ఉన్న  ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ రద్దుపై  తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్  చేసింది. 

Supreme Court  Verdict  reserves  on   Erra gangi Reddy Bail Cancel petition
Author
First Published Jan 5, 2023, 3:44 PM IST

న్యూఢిల్లీ: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా  ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుపై  సుప్రీంకోర్టులో  ఇరు వర్గాల వాదనలు పూర్తయ్యాయి.  తీర్పును  సుప్రీంకోర్టు  ధర్మాసనం రిజర్వ్  చేసింది.  ఎర్రగంగిరెడ్డికి ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని  సుప్రీంకోర్టులో సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై  అన్ని వర్గాల వాదనలను సుప్రీంకోర్టు ధర్మాసనం విన్నది. ఈ విషయమై తీర్పును రిజర్వ్ చేసింది.సీబీఐ తరపున సీనియర్ కౌన్సిల్  నటరాజన్ వాదించారు.గంగిరెడ్డి తరపున సీనియర్ కౌన్సిల్ ఆదినారాయణరావు వాదించారు. 

ఎర్రగంగిరెడ్డికి ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని  సుప్రీంకోర్టులో సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై  అన్ని వర్గాల వాదనలను సుప్రీంకోర్టు ధర్మాసనం విన్నది. ఈ విషయమై తీర్పును రిజర్వ్ చేసింది.  మాజీ మంత్రి వైఎస్ వివేకానంరెడ్డిని  2019 మార్చి  19వ తేదీన రాత్రి దుండగులు ఇంట్లోనే  హత్య చేశారు. ఈ కేసులో  ఎర్రగంగిరెడ్డి నిందితుడిగా  సీబీఐ అభియోగం మోపింది. గంగిరెడ్డికి బెయిల్ ఇవ్వడం వల్ల సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ వాదిస్తుంది.  గంగిరెడ్డి ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని సీబీఐ కోరుతుంది. ఎర్ర గంగిరెడ్డికి డిఫాల్ట్ కింద ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయాన్ని  సుప్రీంకోర్టులో సీబీఐ తరపు న్యాయవాది వాదించారు. ఈ కేసులో  వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీతారెడ్డి కూడా ఇంప్లీడ్ అయ్యారని  సీబీఐ న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. 

ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ  సుప్రీంకోర్టులో సీబీఐ   అధికారులు  2022 నవంబర్  14న  పిటిషన్ దాఖలు చేశారు.వైఎస్ వివేకానంరెడ్డి హత్య కేసులో  నిందితుడిగా  ఉన్న దస్తగిరి  సీబీఐకి అఫ్రూవర్  గా మారారు.  సీబీఐకి దస్తగిరి ఇచ్చిన  వాంగ్మూలం ఆధారంగా  సీబీఐ  అధికారులు విచారణ చేస్తున్నారు.ఈ కేసులో పలువురిని  సీబీఐ అధికారులు అరెస్ట్  చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి  ఇంటి వద్ద వాచ్ మెన్ గా  ఉన్న రంగయ్య  కూడా  సీబీఐకి  వాంగ్మూలం ఇచ్చాడు.  దీంతో  వాచ్ మెన్ రంగయ్య,  దస్తగిరికి భద్రతను కేటాయించారు.

also read:వైఎస్ వివేకా హత్యకేసు:ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంలో సీబీఐ పిటిషన్

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయమై  టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం జరిగింది.  వివేకానందరెడ్డి  హత్య కేసును విషయమై  టీడీపీ నేతలపై వైసీపీ ఆరోపణలు చేసింది.  ఈ ఆరోపణలపై  టీడీపీ నేతలు అంతే స్థాయిలో స్పందించారు.  ఈ కేసును సీబీఐతో విచారణ చేయించాలని  మాజీ మంత్రి  ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి,  వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీతారెడ్డి కూడా  పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేసిన ఏపీ హైకోర్టు  సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేస్తూ  ఇటీవలనే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  ఈ విషయమై  సుప్రీంకోర్టులో సునీతా రెడ్డి  పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 
 

Follow Us:
Download App:
  • android
  • ios