Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ వివేకా హత్యకేసు:ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంలో సీబీఐ పిటిషన్

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి   హత్య కేసులో నిందితుడిగా ఉన్నఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో సీబీఐ  పిటిషన్ దాఖలు చేసింది.

CBI Files petition For Cancel Bail Petition of Gangi Reddy in Supreme Court
Author
First Published Nov 14, 2022, 12:31 PM IST

న్యూఢిల్లీ:మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను రద్దుచేయాలని కోరుతూ సీబీఐ  అధికారులు  సోమవారంనాడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని 2019 మార్చి 19వ  తేదీన ఇంట్లోనే  దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో అరెస్టైన ఎర్రగంగిరెడ్డి  ప్రస్తుతం బెయిల్ పై ఉన్నాడు.ఎర్ర  గంగిరెడ్డి  బెయిల్ రద్దుచేయాలని  కోరుతూ సీబీఐ  ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను  ఏపీ హైకోర్టు ఈ ఏడాది మార్చి 16న కొట్టివేసింది.ఎర్రగంగిరెడ్డి  సాక్షులను ప్రబావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తరపు న్యాయవాది వాదించారు.అయితే ఈ వాదనలకు బలం చేకూరేలా సీబీఐ సాక్ష్యాలను కోర్టుకు  సమర్పించలేదు.దీంతో బెయిల్ రద్దు  పిటిషన్ ను కోర్టు కొట్టి వేసింది. ఈ పరిణామాల  నేపథ్యంలో సుప్రీంకోర్టులో సీబీఐ సోమవారంనాడు గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది.

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు బెంగుళూరులో ల్యాండ్ సెటిల్ మెంట్ లో ఆర్ధిక  లావాదేవీల  విషయమై జరిగిందని దస్తగిరి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో  పేర్కొన్నారు. ఈ కేసులో దస్తగిరి  సీబీఐకి అప్రూవర్ గా మారాడు.  దస్తగిరి  వివేకానందరెడ్డి వద్ద డ్రైవర్ గా పనిచేశాడు.ఈ కేసులో పలువురిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సీబీఐ  విచారణ చేస్తుంది.అంతేకాదు  వివేకానందరెడ్డి ఇంటి వద్ద వాచ్ మెన్ గా పనిచేసిన రంగయ్య కూడా సీబీఐకి కీలక సమాచారం ఇచ్చాడు.ఈ  సమాచారం  ఆధారంగా సీబీఐ  అధికారులు  విచారణ జరుపుతున్నారు.  

ఇదిలా  ఉంటే ఈ కేసు విచారణను ఏపీ  రాష్ట్రంలో కాకుండా మరో రాష్ట్రంలో చేయాలని వైఎస్ వివేకానందరెడ్డి  కూతురు వైఎస్ సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన ఉన్నత న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. 2019లో హత్య జరిగినప్పటికీ  ఇంకా  కూడ నిందితులు  ఎవరనే విషసయాన్ని తేల్చకపోవడంపై  సునీతారెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు.

also read:వైఎస్ వివేకా హత్య కేసు:వేరే రాష్ట్రంలో విచారణపై ఈ నెల 21న నిర్ణయమన్న సుప్రీం

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయమై టీడీపీ,వైసీపీ మధ్య మాటలయుద్ధం జరిగింది. టీడీపీ  నేత బీటెక్ రవి,ప్రస్తుత బీజేపీనేత మాజీ  మంత్రి ఆదినారాయణరెడ్డిపై వైసీపీ ఆరోపణలు  చేసింది. ఈ ఆరోపణలను ఈ   ఇద్దరూ ఖండించారు.ఈ  హత్యకేసుపై సీబీఐ విచారణ జరిపించాలని  కూడా వీరిద్దరూ  కూడ ఏపీహైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు.ఈ పిటిషన్ పై విచారణ చేసిన హైకోర్టు సీబీఐ  విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios