ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్: నేడు విచారించనున్న సుప్రీంకోర్టు


ఏపీ ఫైబర్ నెట్ కేసులో  చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై  సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

 Supreme Court To hear Chandrababu Naidu Anticipatory bail petition in AP Fibernet Case lns


అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై  శుక్రవారంనాడు సుప్రీంకోర్టులో  విచారణ జరగనుంది.ఈ నెల  17వ తేదీన ఏపీ ఫైబర్ నెట్  కేసులో  చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై  సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది. ఇవాళ్టికి ఫైబర్ నెట్ కేసులో  చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.ఇవాళ  సుప్రీంకోర్టులో  ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది.

ఏపీ ఫైబర్ నెట్ కేసులో  ఏపీ సీఐడీ   దాఖలు చేసిన  పీటీవారంట్ కు  ఏసీబీ కోర్టు  ఈ నెల  12న  ఆమోదం తెలిపింది.  ఈ నెల  16న  చంద్రబాబును ఏసీబీ కోర్టులో ప్రత్యక్షంగా హాజరుపర్చాలని  ఏసీబీ జడ్జి ఆదేశించారు. దీంతో  సుప్రీంకోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాదులు  సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ నెల  12న  ఈ పిటిషన్ పై  విచారణ నిర్వహించారు.  సుప్రీంకోర్టులో విచారణ జరిపే వరకు  చంద్రబాబును అరెస్ట్ చేయబోమని  సుప్రీంకోర్టుకు ఏపీ సీఐడీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ  హామీ ఇచ్చారు.సుప్రీంకోర్టులో  జరిగిన  వాదనలపై  ఏపీ సీఐడీ తరపు న్యాయవాదులు  విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు.

also read:ఏపీ ఫైబర్ నెట్ కేసులో పీటీవారంట్‌కు ఆమోదం: చంద్రబాబును కోర్టులో హాజరుపర్చాలన్న జడ్జి

దీంతో  ఈ కేసులో చంద్రబాబును  ఏసీబీ కోర్టు ముందు హాజరుపర్చలేదు. ఈ నెల  17న  ఏపీ ఫైబర్ నెట్ కేసులో  చంద్రబాబు ముందస్తు బెయిల్ పై  సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ఈ పిటిషన్ పై విచారణను  ఇవాళ్టికి  సుప్రీంకోర్టు వాయిదా వేసింది.  దీంతో ఇవాళ  సుప్రీంకోర్టులో  ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios