అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా లేదా అనే అంశంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు శుక్రవారం నాడు స్టే ఇచ్చింది. 

ఏపీ హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు శుక్రవారం నాడు స్టే ఇచ్చింది. వ్యవస్థలు ఏమీ కుప్పకూలలేదు కదా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

 

హైకోర్టు జడ్జి ఎందుకు అలా వ్యాఖ్యానించారో అర్ధం కావడం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. శీతాకాల సెలవుల తర్వాత ఈ పిటిషన్ పై విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు తెలిపింది.

also read:స్థానిక ఎన్నికలు : జగన్ సర్కార్‌పై ఏపీ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన నిమ్మగడ్డ

రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా లేదా తేలుస్తామని ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీన హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఏపీ హైకోర్టు సుప్రీంను ఆశ్రయించింది.ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే ధర్మాసనం హైకోర్టు ఆదేశాలపై యథాతథస్థితిని కొనసాగించాలని సూచించింది.

హైకోర్టు ఆదేశాలు ఆందోళనకరంగా ఉన్నాయని సుప్రీంకోర్టు తెలిపింది. హైకోర్టు జడ్జి ఎందుకు అలా అర్ధం కావడం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.వ్యవస్థ ఏమీ కుప్పకూలలేదు కదా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

ఏపీలో పోలీసులు చట్ట ఉల్లంఘనలపై దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్లు రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నవారిని పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్  దాఖలు చేసిన పిల్ పై  విచారణ సమయంలో ఏపీ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.