స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏపీ ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య వైరం రోజు రోజుకు పెరిగిపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సహకరించకపోవడంపై ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం మరో పిటిషన్ ను దాఖలు చేసింది. జగన్ సర్కార్ కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని ఏపీ ఎస్ఈసీ పిటిషన్ దాఖలు చేసింది.

also read:ఫిబ్రవరిలో స్థానిక సంస్థలు నిర్వహణ సాధ్యం కాదు: హైకోర్టులో జగన్ సర్కార్ అడిషనల్ అఫిడవిట్

ఏపీ రాష్ట్రంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రయత్నాలు చేస్తోంది. ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఏపీ సర్కార్ తెగేసి చెబుతోంది.  ఫిబ్రవరిలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయాల్సిన అవసరం ఉన్నందున ఎన్నికల నిర్వహణకు సిబ్బందిని పోలీసులను ఇవ్వలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ కు ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కౌంటర్ దాఖలు చేసింది.  కరోనా వ్యాక్సిన్ పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలకు ఇబ్బంది కల్గిస్తోందని ఏపీ ఎస్ఈసీ కౌంటర్ దాఖలు చేసింది.

స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వం తీరును నిరసిస్తూ శుక్రవారం నాడు ఏపీ ఎస్ఈసీ  కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది.