ఏపీ ఫైబర్ నెట్ కేసు: బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంలో జరగని విచారణ
ఆంధ్రప్రదేశ్ ఫైబర్ గ్రిడ్ కేసులో ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగలేదు. స్పెషల్ బెంచ్ కూర్చోవడం లేదని జస్టిస్ అనిరుద్ద బోస్ చెప్పారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఫైబర్ గ్రిడ్ (ఏపీ ఫైబర్ నెట్ ) కేసులో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై బుధవారం నాడు విచారణ జరగలేదు. సుప్రీంకోర్టు స్పెషల్ బెంచ్ ఇవాళ కూర్చోవడం లేదని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ అనిరుద్ద బోస్ చెప్పారు.విచారణకు మరో తేదిని కేటాయిస్తామని సుప్రీంకోర్టు జడ్డి అనిరుద్ద బోస్ తెలిపారు.
also read:వై.ఎస్.షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు: జగన్‌పై డైరెక్ట్ ఫైట్
సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ సీఐడీ తరపు న్యాయవాది ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయితే ఫైబర్ నెట్ కేసును విచారించాల్సిన స్పెషల్ బెంచ్ కూర్చోవడం లేదని జస్టిస్ అనిరుద్ద బోస్ చెప్పారు.ఈ పిటిషన్ పై విచారణకు మరో తేదీని తెలుపుతామని జస్టిస్ అనిరుద్ద బోస్ తెలిపారు.వేర్వేరు కోర్టుల్లో అనిరుద్దబోస్, బేలా త్రివేది ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు స్పెషల్ బెంచ్ లో ఈ ఇద్దరు జడ్జిలు కూర్చోవాల్సి ఉంది. అయితే వేర్వేరు కోర్టుల్లో కేసుల విచారణ నేపథ్యంలో స్పెషల్ బెంచ్ కూర్చోలేదు.
ఆప్ నేత సత్యేంద్రజైన్ వర్సెస్ ఈడీ కేసుపై విచారణలో జస్టిస్ బేలా త్రివేది ఉన్నారు.ఈ కేసు విచారణ సాగుతున్నందున బేలా త్రివేది స్పెషల్ బెంచ్ లో కూర్చొనేందుకు రాలేదు. ఈ కారణంగా స్పెషల్ బెంచ్ కూర్చోలేదు. చివరి నిమిషంలో స్పెషల్ బెంచ్ కూర్చోవడం సాధ్యం కాలేదు.
also read:వై.ఎస్. షర్మిలకు కాంగ్రెస్ పగ్గాలు: నాడు తండ్రి, నేడు తనయ
ఈ కేసులో చంద్రబాబు తరపున వాదించడానికి సిద్దార్ధ లూథ్రా కోర్టుకు హాజరయ్యారు. కానీ స్పెషల్ బెంచ్ కూర్చోవడం లేదని జడ్జి చెప్పడంతో మరో తేదీ కోసం ఇరు వర్గాల తరపు న్యాయవాదులు ఎదురు చూస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై ఈ నెల 16న సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పును వెల్లడించింది. ఏపీ స్కిల్ కేసు విషయమై తీర్పును వెల్లడించిన తర్వాత ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పై విచారణ జరుపుతామని గత ఏడాది అక్టోబర్ మాసంలో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తెలిపింది.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సుప్రీంకోర్టు నిన్న తీర్పును వెల్లడించింది. దీంతో ఇవాళ ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ జరగాల్సి ఉంది. కానీ, సుప్రీంకోర్టు స్పెషల్ బెంచ్ ఇవాళ కూర్చోని కారణంగా ఈ పిటిషన్ పై విచారణ జరగలేదు.