Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు: ఎంవీ కృష్ణారెడ్డి పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీం

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  హత్య కేసులో  ఎంవీ కృష్ణారెడ్డి దాఖలు  చేసిన పిటిషన్ ను  సుప్రీంకోర్టు  బుధవారంనాడు డిస్మిస్ చేసింది.

Supreme Court  Dismisses  MV Krishna Reddy  Petition lns
Author
First Published Jul 5, 2023, 2:00 PM IST

అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో  ఎంవీ కృష్ణారెడ్డి దాఖలు  చేసిన పిటిషన్ ను  సుప్రీంకోర్టు  బుధవారంనాడు డిస్మిస్ చేసింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో  దస్తగిరి అప్రూవర్ గా మారడాన్ని   ఎంవీ కృష్ణారెడ్డి  సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.  ఈ కేసులో  జోక్యం  చేసుకోలేమని  సుప్రీంకోర్టు తెలిపింది.  తమ అభిప్రాయాలను  హైకోర్టు ముందు చెప్పుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి వద్ద పీఏగా ఎంవీ కృష్ణారెడ్డి  పనిచేసేవారు. దస్తగిరి అప్రూవర్ గా మారడాన్ని  ఎంవీ కృష్ణారెడ్డి దాఖలు  చేసిన పిటిషన్ లో  వివేకానందరెడ్డి కూతురు  వైఎస్ సునీతారెడ్డి ఇంప్లీడ్ అయ్యారు. దర్యాప్తును  అడ్డుకొనేందుకు  కృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు  చేశారని వైఎస్ సునీతా రెడ్డి  తరపు న్యాయవాది   సుప్రీంలో వాదించారు. ఎంవీ కృష్ణారెడ్డిని వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా  చేర్చిందని   సునీతారెడ్డి  న్యాయవాది వాదించారు.  ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత  ఎంవీ కృష్ణారెడ్డి పిటిషన్ ను సుప్రీంకోర్టు  ఇవాళ  డిస్మిస్  చేసింది. 

also read:వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్: వైఎస్ సునీతా రెడ్డి పిటిషన్ పై విచారణ ఈ నెల 13కి వాయిదా

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 2019  మార్చి  14న హత్యకు గురయ్యాడు.   వివేకానందరెడ్డి హత్య కేసును  సీబీఐ విచారిస్తుంది. వివేకానంద  రెడ్డి హత్య  జరిగిన సమయంలో చంద్రబాబు సర్కార్ సిట్ ను ఏర్పాటు  చేసింది. ఆ తర్వాత  వైఎస్ జగన్  ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జగన్ సర్కార్  మరో సిట్ ను ఏర్పాటు  చేసింది.  వివేకానందరెడ్డి హత్య  కేసును  సీబీఐతో విచారించాలని  దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ నిర్వహించిన   ఏపీ హైకోర్టు   సీబీఐ విచారణకు  ఆదేశాలు  జారీ చేసింది. ఈఏడాది  జూన్  30వ తేదీ నాటికి  వైఎస్ వివేకానందరెడ్డి హత్య  కేసు విచారణను  పూర్తి చేయాలని సీబీఐని  సుప్రీంకోర్టు ఆదేశాలు  జారీ చేసిన విషయం తెలిసిందే.వైఎస్ వివేకానందరెడ్డి  హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఎనిమిదో నిందితుడిగా  సీబీఐ చేర్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios