Asianet News TeluguAsianet News Telugu

krishna tribunal కు నూతన విధి విధానాలు: ఆంధ్రప్రదేశ్ పిటిషన్ పై విచారణ వచ్చే ఏడాదికి వాయిదా

కృష్ణా ట్రిబ్యునల్ కు నూతన విధివిధానాలపై  ఆంధ్రప్రదేశ్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను  సుప్రీంకోర్టు వాయిదా వేసింది.  కేంద్ర జల్ శక్తి  మంత్రిత్వశాఖ గడువు కోరడంతో విచారణ వాయిదా పడింది.

Supreme court adjourns  hearing Andhrapradesh petition on  krishna water disputes tribunal lns
Author
First Published Dec 1, 2023, 4:33 PM IST

న్యూఢిల్లీ:కృష్ణా ట్రిబ్యునల్ కు నూతన విధి విధానాలపై  ఆంధ్రప్రదేశ్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను శుక్రవారం నాడు సుప్రీంకోర్టు  2024 జనవరి 12వ తేదీకి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను  సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ విషయమై కౌంటర్ దాఖలు చేయడానికి  కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ సమయం కోరడంతో  విచారణను వచ్చే ఏడాది జనవరి  12వ తేదీకి  వాయిదా వేసింది సుప్రీంకోర్టు.

ఈ ఏడాది అక్టోబర్ మాసంలో  కృష్ణా జలాలపై  నిర్మించిన  ప్రాజెక్టులకు నీటి కేటాయింపు చేయాలని  కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబర్ 4న నిర్ణయం తీసుకుంది.ఆంధ్రప్రదేశ్,  తెలంగాణల మధ్య కృష్ణా జలాలను తాజాగా లెక్కించి పంపిణీ చేయాలంటూ కృష్ణా ట్రిబ్యునల్ కు  ఆదేశాలు జారీ చేసింది  కేంద్రం. అంతేకాదు కృష్ణా ట్రిబ్యునల్ గడువును కూడ పెంచింది. ఈ నిర్ణయానికి అనుగుణంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది.  ఈ మార్గదర్శకాలను  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబర్ 17న  సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios