ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ , ఏపీ ఫైబర్ నెట్ కేసులు: చంద్రబాబు పిటిషన్లపై విచారణ ఈ నెల 17కి వాయిదా

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ ఈ నెల  17వ తేదీకి వాయిదా పడింది.

Supreme court Adjourns Chandrababu petition to on october 17 over AP Skill development case lns


న్యూఢిల్లీ: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు దాఖలు చేసిన  ఎస్‌ఎల్‌పీ పిటిషన్ పై విచారణను ఈ నెల  17వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. మరో వైపు ఏపీ ఫైబర్ నెట్ కేసులో  కూడ విచారణను  మంగళవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.ఈ రెండు పిటిషన్లపై ఈ నెల  17 మధ్యాహ్నం విచారణ నిర్వహించనున్నట్టు సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.జస్టిస్ అనిరుద్దబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం  శుక్రవారం నాడు మధ్యాహ్నం చంద్రబాబు ఎస్ఎల్‌పీపై విచారణను చేపట్టింది.

ఈ కేసులో చంద్రబాబు తరపు న్యాయవాది  సిద్దార్ధ్ లూథ్రా వాదనలు విన్పించారు. స్కిల్ కేసు విచారణకు ఫైబర్ నెట్ కేసుతో సంబంధం ఉందని  లూథ్రా వాదించారు.మరో కేసులో చంద్రబాబును ఈ నెల 16న  కోర్టులో  ప్రవేశ పెట్టేందుకు  వారంట్ తీసుకున్న విషయాన్ని లూథ్రా సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు.కేసులపై కేసులు పెట్టి సర్కస్ ఆడిస్తున్నారని  లూథ్రా చెప్పారు. ఇక్కడ కూడా 17 ఏ నుఛాలెంజ్ చేస్తున్నారా అని లూథ్రాను జస్టిస్ త్రివేది ప్రశ్నించారు.అవును 17 ఏ ప్రతి చోటా వర్తిస్తుందని సిద్ధార్థ్ లూథ్రా  సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు.

ఇదిలా ఉంటే  ఏపీ సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ  వాదనలు వినిపించారు.  ఎఫ్ఐఆర్ రద్దు చేయాలన్న అంశంపై ఎంసీ గుప్తా కేసును రోహత్గీ ప్రస్తావించారు.చట్టం అమల్లో ఉన్నప్పుడు జరిగే నేరాలకు అదే చట్టం వర్తిస్తుందని రోహత్గీ  వాదించారు.చట్టం రద్దు చేసినా.. వెనక్కి తీసుకున్నప్పుడు నేరం జరిగినప్పటి చట్టమే వర్తిస్తుందని రోహత్గీ  వాదించారు.కొత్త చట్టం అమల్లోకి రాకముందే  నేరం జరిగినందున సవరణ చట్టం ఈ కేసుకు వర్తించదని రోహత్గీ  సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు.

అసలు ఎంక్వయిరీ విషయంలోనే నిరోధం ఉన్నప్పుడు కేసులు ఎలా ఫైల్ చేస్తారని జస్టిస్ బోస్ ప్రశ్నించారు. కేసు నమోదు చేసే అధికారం పోలీసు అధికారికి లేనప్పుడు కేసు నమోదు ఎలా చేస్తారని సుప్రీంకోర్టు జడ్జి  బోస్ ప్రశ్నించారు. అధికార విధులు నిర్వర్తించడమంటే అవినీతికి పాల్పడడం కాదు కదా అని  రోహత్గీ  చెప్పారు.అధికార విధులనిర్వహణ ముసుగులో  అవినీతికి పాల్పడే పరిస్థితి ఉండకూడదు కదా అని రోహత్గీ పేర్కొన్నారు.చట్ట సవరణ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.. కేసు పాతదే అంటారు... అంతేనా అని జస్టిస్ త్రివేది  ప్రశ్నించారు.చట్ట సవరణ ముందు  కేసు కాబట్టే 17ఏ వర్తించదని రోహత్గీ  వాదించారు.

2018 జూలైలో చట్టసవరణ జరిగింది.. 2014, 2015 కేసులకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద పరిగణించలేం కదా అని రోహత్గీ  వాదనలు వినిపించారు.17 ఏ అన్నది అవినీతికి రక్షణ కాకూడదని  రోహత్గీ సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. సెక్షన్ 19 మాదిరిగా  17 ఏ సంపూర్ణంగా కేసు నమోదుకు విరోధం కల్పించలేదని  రోహత్గీ వాదించారు.

ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై సమర్పించిన కౌంటర్ అఫిడవిట్ లోని అంశాలను రోహత్గీ సుప్రీంకోర్టు ముందుంచారు.ప్రభుత్వ విభాగాల సూచనలను పక్కన పెట్టి డిజైన్ టెక్ కంపెనీకి నిధులు మంజూరు చేసిన విషయాన్ని రోహత్గీ   సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు.

also read:సీఐడీ అధికారుల కాల్ డేటా: చంద్రబాబు పిటిషన్ పై విచారణ ఈ నెల 18కి వాయిదా

డిజైన్ టెక్ కంపెనీకి ఇచ్చిన నిధులను షెల్ కంపెనీల ద్వారా స్వంత మనుషులకు  వచ్చేలా  అప్పటి సీఎం వ్యవహరించారని  రోహత్గీ చెప్పారు.డిజైన్ టెక్ ఇచ్చిన నిధుల నుండి మొత్తం సొమ్ము కానీ, కొంత మొత్తం కానీ షెల్ కంపెనీల ద్వారా బాబుకు చేరిందని  రోహత్గీ  వాదించారు.పెద్ద మొత్తంలో  నగదు చెల్లింపు ఆరోపణలున్నందునే దీన్ని 17ఏ కింద పరిగణించకూడదని రోహత్గీ  చెప్పారు.

ఏపీ ఫైబర్ నెట్ కేసు

ఏపీ ఫైబర్ నెట్ కేసులో ఏపీ సీఐడీ దాఖలు చేసిన పీటీ వారంట్ కు ఏసీబీ కోర్టు ఆమోదం తెలిపింది.ఈ నెల  16న  కోర్టులో హాజరు పర్చాలని  ఏసీబీ కోర్టు ఆదేశించిన విషయాన్ని  సుప్రీంకోర్టులో లూథ్రా ప్రస్తావించారు.   ఏపీ ఫైబర్ నెట్ లో ఏసీబీ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు లాయర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తొలుత ఏపీ ఫైబర్ నెట్ కేసు ముందస్తు బెయిల్ పై విచారణను  లూథ్రా కోరారు.  ఈ విషయమై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. సోమవారంనాడు చంద్రబాబును ఈ కేసులో సీఐడీ అరెస్ట్ చేసే అవకాశం ఉందని  లూథ్రా కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే  ఈ కేసులో మంగళవారం వరకు  చంద్రబాబును అరెస్ట్ చేయబోమని సీఐడీ తరపు న్యాయవాది  సుప్రీంకోర్టుకు తెలిపారు.ఫైబర్ నెట్ కేసులో పీటీ వారంట్లను  అమలు చేయవద్దని  ఏసీబీ కోర్టుకు విన్నవిస్తామని రోహత్గీ  సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో ఈ పిటిషన్ పై విచారణను మంగళవారానికి వాయిదా వేసింది కోర్టు.


 


 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios