విజయవాడ: కృష్ణా జిల్లాలో ట్రాఫిక్ ఎస్సై అద్భుతమైన సాహసం చేశాడు. ప్రాణాలకు సైతం తెగించి కాల్వలో కొట్టుకుపోతున్న మహిళను కాపాడారు. వివరాల్లోకి వెళ్తే బందరు కాల్వలో కృష్ణలంక దగ్గర ఒక మహిళ స్థానికులు గుర్తించారు. ప్రజలు పెద్ద ఎత్తున గుమ్మిగూడటంతో అనుమానం వచ్చిన ట్రాఫిక్ ఎస్సై అర్జున్ అక్కడకు వెళ్లి చూశారు. 

కాపాడాలంటూ మహిళ కేకలు వేయడంతో వెంటనే కాల్వలోకి దూకేశారు. మహిళను ప్రాణాలతో కాపాడారు. ట్రాఫిక్ ఎస్సై అర్జునరావు తెగువను చూసి పలువురు స్థానికులు, తోటి పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అర్జునరావు సాహసాన్ని కొనియాడారు.  

కాల్వలో  కొట్టుకుపోతున్న మహిళను ప్రాణాలకు తెగించి కాపాడిన ఎస్సై అర్జునరావు తెగువను పలువురు అభినందిస్తున్నారు. ప్రాణాలకు తెగించి మహిళను కాపాడిన అర్జునరావు నిజమైన పోలీసుల రక్షక భటుడు అంటే ఇలానే ఉండాలంటూ ప్రశంసించారు.