అలా చెప్పారు, చంద్రబాబు ఓపికకు జోహార్లు: సుజనా చౌదరి

Sujana Chowdary explains TDP's helplessness
Highlights

ఢిల్లీలో పనులు కావడం లేదని చెప్పినా రాష్ట్రం కోసం ఓపిక పట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పేవారని, చంద్రబాబు ఓపికకు జోహార్లు అని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు సుజనా చౌదరి అన్నారు.

విజయవాడ: ఢిల్లీలో పనులు కావడం లేదని చెప్పినా రాష్ట్రం కోసం ఓపిక పట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పేవారని, చంద్రబాబు ఓపికకు జోహార్లు అని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు సుజనా చౌదరి అన్నారు. ఆయన మంగళవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ మహానాడులో ప్రసంగించారు. 

కేంద్రం ప్రత్యేక సహాయం అందిస్తామని 2016లో చెప్పినప్పటికీ అందించలేదని సుజనా చౌదరి అన్నారు. కేంద్రం అసమర్థతను టీడీపి ఎత్తి చూపిందని ఆయన అన్నారు. ఎపికి సాయం చేశామని కాగిితాల మీద చెప్పినా క్షేత్రస్థాయిలో అది అందుబాటులోకి రాలేదని అన్నారు. పార్లమెంటులో చేసిన చట్టం కూడా అమలు కాలేదని అన్నారు. చట్టంలో సవరణలు చేయడానికి వీలున్నా చేయలేదని విమర్శించారు. దాని వల్ల మనం దెబ్బ తిన్నామని చెప్పారు.

చంద్రబాబు సూచన మేరకు తాము కొంత సాధించామని ఆయన అన్నారు.గత ఎన్నికల్లో కాంగ్రెసుకు డిపాజిట్లు రాలేదని, బిజెపి ఏమైనా గెలిచిందంటే అది తమ దయవల్లనే అని అన్నారు. ప్రతిపక్షాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలోని 25 లోకసభ స్థానాల్లో టీడీపిని గెలిపిస్తే తమ సత్తా చాటుతామని అన్నారు. 

బిజెపి 80 శాతం హామీలను నెరవేర్చామని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటేనే దేశానికి మంచిదని అన్నారు. ఫెడరల్ వ్యవస్థ అంటే అన్ని పార్టీలతో కూడిందని అన్నారు.

loader