Asianet News TeluguAsianet News Telugu

స్వర్ణంతో మెరిసిన సుధ

తొలి రెండు రోజుల కన్నా మూడో రోజు జోరు తగ్గినా స్వర్ణం సహా ఐదు పతకాలు సాధించటం గమనార్హం. మొత్తంగా భారత్ 20 పతకాలతో అగ్రస్ధానంలో నిలిచింది. చైనా 15 పతకాలతో రెండో స్ధానంతో సరిపెట్టుకుంది. మరో మూడు పతకాలు సాధిస్తే ఈ మెగా ఈవెంట్లో భారత్ ఆల్ టైం రికార్డు ప్రధర్శన నమోదవుతుంది.

Sudha singh bagged gold in steeplechase

ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్పులో ఒలంపియన్ సుధాసింగ్ మెరిసింది. శనివారం జరిగిన అన్నీ పోటీల్లో కలిసి స్టీపుల్ ఛేజ్ లో మాత్రమే భారత్ కు స్వర్ణ పతకం వచ్చింది. మహిళల స్టీపుల్ ఛేజ్ లో సుధ 9.59.47 నిముషాల టైమింగ్ తో స్వర్ణం సాధించింది. ఇదే రేసులో మరో అథ్లెట్ పరుల్ ఛౌధరి రజతం సాధించింది. మహిళల 400 మీటర్ల హర్డిల్స్ లో అను రాఘవన్ రజతం సాధించగా షీనా (ట్రిపుల్ జంప్) కాంస్య పతకంతో సరిపెట్టుకుంది.

400 మీటర్ల హర్డిల్స్ లో జుబైర్ కు కాంస్యం సాధిచంటం విశేషమే.  3 వేల మీటర్ల స్టీపుల్ ఛేజ్ లో నవీన్ కుమార్ ఏడు, దుర్గాదాస్ ఎనిమిది స్ధానాల్లో నిలిచారు. పురుషుల 110 మీటర్ల హర్డిల్స్ లో సిద్ధార్ధ ఐదే స్ధానంతో సరిపెట్టుకున్నాడు. ఇక, మహిళల 4x100 రిలే రేసులో భారత జట్టు కాంస్య పతకం సొంతం చేసుకుంది. ద్యుతిచంద్, శ్రబానినంద, హిమశ్రీ రాయ్, మెర్లిన్ జోసెఫ్ తో కూడిన జట్టు 44.50 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుంది. ఈ టోర్నిలో గడచిన పదేళ్ళల్లో మహిళల 4x100 మీటర్ల రిలేలో పతకం సాధించటం ఇదే తొలిసారి కావటం గమనార్హం. 

తొలి రెండు రోజుల కన్నా మూడో రోజు జోరు తగ్గినా స్వర్ణం సహా ఐదు పతకాలు సాధించటం గమనార్హం. మొత్తంగా భారత్ 20 పతకాలతో అగ్రస్ధానంలో నిలిచింది. చైనా 15 పతకాలతో రెండో స్ధానంతో సరిపెట్టుకుంది. మరో మూడు పతకాలు సాధిస్తే ఈ మెగా ఈవెంట్లో భారత్ ఆల్ టైం రికార్డు ప్రధర్శన నమోదవుతుంది. ఆదివారం టోర్నమెంటుకు ముగింపు రోజు కావటంతో ఎన్ని పతకాలు సాధిస్తుందో అని అందరూ ఎదురుచూస్తున్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios