ర్యాంకుల కోసం కార్పొరేట్ విద్యాసంస్ధలు విద్యార్ధులను దారుణంగా బాదేస్తున్నాయి.

ర్యాంకుల కోసం కార్పొరేట్ విద్యాసంస్ధలు విద్యార్ధులను దారుణంగా బాదేస్తున్నాయి. ర్యాంకుల గోలలో పడి విద్యార్ధులను పశువులకన్నా హీనంగా చూస్తున్నారు. తాజాగా కృష్ణాజిల్లాలోని నందిగామలో జరిగిందదే. ఆలస్యంగా వెలుగు లోకి వచ్చిన వీడియోను చూస్తే అధ్యాపకుడు విద్యార్ధులను ఎలా బాదేస్తున్నాడో అర్ధమైపోతుంది. నందిగామలోని దీక్షా కాలేజీలో మొన్నటి ఆగస్టులో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎప్పుడైతే వీడియో బయట పడిందో కలెక్టర్ వెంటనే విచారణకు ఆదేశించారు.