కార్యక్రమం సందర్భంగా హీలియంతో నింపిన బెలూన్లను చంద్రబాబు ఎగరేసారు. అయితే అవి గాలిలోకి ఎగరకుండా పేలిపోయాయి. దాంతో అక్కడే ఉన్న ఇద్దరు విద్యార్ధులు గాయపడ్డారు.

చంద్రబాబునాయుడు పాల్గొన్న వనం-మనం కార్యక్రమంలో హీలియం బెలూన్లు పగిలాయి. వనం-మనం కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు గుంటూరు జిల్లాలోని ఓబులనాయుడుపాలెం గ్రామానికి వచ్చారు. కార్యక్రమం సందర్భంగా హీలియంతో నింపిన బెలూన్లను చంద్రబాబు ఎగరేసారు. అయివి అవి గాలిలోకి ఎగరకుండా పేలిపోయాయి. దాంతో అక్కడే ఉన్న ఇద్దరు విద్యార్ధులు గాయపడ్డారు. అధికారులు వెంటనే అప్రమత్తమై వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.