అనంతపురంలో ఆకతాయిలు రెచ్చిపోయారు. ఓ యువకుడిపై కొందరు యువకులు మూకుమ్మడిగా దాడి చేశారు. నగరంలోని ఆర్ట్స్ కాలేజీలో విద్యార్ధుల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారి తీసింది.

కనికంటివారి పాలెంకు చెందిన శివయ్య అనే విద్యార్ధిపై కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. రక్తం కారుతున్నప్పటికీ అతనిని యువకులు విడిచిపెట్టలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఆర్ట్స్ కాలేజీకి చేరుకుని యువకుడిని ఆస్పత్రికి తరలించారు.

అతనిపై దాడి చేసిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ ఘటన రెండు రోజుల క్రితం జరిగినదిగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.