విజయనగరంలో దారుణం జరిగింది. బస్సులో ఓ విద్యార్థి మరో విద్యార్థిపై చాకుతో దాడి చేశాడు. దీంతో డ్రైవర్ బస్సును ఆపి పోలీసులకు సమాచారం అందించాడు. 

"

వివరాల్లోకి వెడితే విజయనగరం నుండి ఇప్పలవలస వెళ్లే బస్సు లో ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇది కాస్తా ముదిరి బడే వలస గ్రామానికి చెందిన మురళి అనే విద్యార్థి కొంపంగి గ్రామానికి చెందిన చేతన్ అనే విద్యార్థి పై చాకుతో దాడి చేశాడు.

ఈ దాడిలో  విద్యార్థి చేతన్  తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఇతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. 

తోటి ప్రయాణికులు, డ్రైవర్ అందించిన సమాచారం మేరకు గజపతినగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.