అమరావతికి భూములు వద్దు: పవన్ కల్యాణ్

First Published 21, Jun 2018, 2:41 PM IST
Stop land acquisition for Amaravati: Pawan Kalyan
Highlights

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం భూముల సేకరణపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ట్విట్టర్‌లో స్పందించారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం భూముల సేకరణపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ట్విట్టర్‌లో స్పందించారు. అమరావతిలో భూసేకరణ చట్టాన్ని అమలు చేయవద్దని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు. 

రాజధానికి అవసరాలకు మించి ప్రభుత్వం ఇప్పటికే భూమిని సేకరించిందని, ఇక భూసేకరణ అవసరం లేదని అన్నారు. ప్రజలకు ప్రభుత్వం సంరక్షకులుగా ఉండాలే తప్ప భూకబ్జాదారులుగా వ్యవహరించకూడదని అన్నారు.

ఈ సమస్యపై అమరావతి రైతులతో తాను సమావేశం అవుతానని పవన్ ట్వీట్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆభరణాల మాయంపై కూడా ఆయన స్పందించిన విషయం తెలిసిందే.

loader