ఇంకా ప్రారంభించకుండానే: విశాఖలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి, రెండు కోచ్‌ల అద్దాలు ధ్వంసం

విశాఖలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రెండు కోచ్‌ల అద్దాలు ధ్వంసమయ్యాయి. 

stone pelting on vande bharat express in visakhapatnam

విశాఖలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. బుధవారం కంచరపాలెంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో రెండు కోచ్‌ల అద్దాలు ధ్వంసమయ్యాయి. ట్రయల్ రన్‌లో భాగంగా చెన్నై నుంచి రైలు విశాఖ వస్తుండగా రాళ్ల దాడి జరిగింది. వందే భారత్ ట్రైన్‌పై రాళ్ల దాడిని వాల్తేర్ డివిజన్ అధికారులు ధ్రువీకరించారు. దీంతో దుండగులను పట్టుకునేందుకు రైల్వే పోలీసులు రంగంలోకి దిగారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది

కాగా.. ఈ నెల 19న హైదరాబాద్-విశాఖపట్నం మధ్య వందేభారత్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించాల్సి వుంది. అయితే అనివార్య కారణాల వల్ల ప్రధాని పర్యటన తాత్కాలికంగా వాయిదా పడింది. మళ్లీ మోడీ తెలంగాణ ఎప్పుడు వచ్చేది త్వరలోనే తెలియజేస్తామని బీజేపీ నేతలు తెలిపారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. జనవరి 19న  రూ.7,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతోపాటు జాతికి అంకితం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు రావాల్సి వుంది. వందే భారత్ రైలు సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య సుమారు ఎనిమిది గంటల్లో నడుస్తుంది. రైలు కోసం ఊహించిన ఇంటర్మీడియట్ స్టాప్‌లలో వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి ఉన్నాయి.

ALso REad: పశ్చిమ బెంగాల్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి.. ప్రారంభించిన రెండు రోజుల్లోనే ఘటన..

ఇకపోతే.. ఇటీవల పశ్చిమ బెంగాల్ లో ప్రారంభించిన హౌరా-న్యూ జల్‌పైగురి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ జనవరి 3న రాళ్లు రువ్విన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీంతో రెండు కోచ్‌ల కిటికీలు దెబ్బతిన్నాయి. మరో ఘటనలో జనవరి 2న హౌరా-న్యూ జల్‌పైగురి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో 22303 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కోచ్ నంబర్ C13 గ్లాస్ డోర్ దెబ్బతింది. దాడి జరిగిన రైలు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మొదలైన మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కావడం గమనార్హం. ఈ రైలును ప్రధాని నరేంద్ర మోడీ గత నెల 30వ తేదీన శుక్రవారం జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ప్రధాని తన తల్లి హీరాబెన్ ను కోల్పోయి, అంత్యక్రియలు నిర్వహించి మరీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తన తల్లికి సంప్రదాయబద్దంగా చేయాల్సిన అన్ని క్రతువులు పూర్తి చేసి, కొన్ని గంటల్లోనే ప్రధాని ఈ రైలును ప్రారంభించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios