సంచలనం: పులివెందులలో వైసిపి..టిడిపి మధ్య రాళ్ళ వర్షం..(వీడియెలు)

First Published 4, Mar 2018, 5:46 PM IST
stone pelting on each by tdp and ycp cader in pulivendula
Highlights
  • ఆదివారం  మధ్యాహ్నం ఎంపిని పోలసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించటంతో ఉద్రిక్తత పెరిగిపోయింది.

పులివెందుల పట్టణంలో రాళ్ళ వర్షంతో తీవ్ర ఉద్రిక్తలు చోటు చేసుకుంది. పులివెందుల అభివృద్ధిపై టిడిపి నేత సతీష్ రెడ్డి చేసిన సవాలుతో సమస్య మొదలైంది. సతీష్ చేసిన సవాలుకు వైసిపి ఎంపి అవినాష్ రెడ్డి ప్రతిసవాలు విసరటంతో ఉద్రిక్తత పీక్ స్టేజ్ కు చేరుకుంది. ఆదివారం  మధ్యాహ్నం ఎంపిని పోలసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించటంతో ఉద్రిక్తత పెరిగిపోయింది.

అవినాష్ కోసం వైసిపి శ్రేణులు, కార్యకర్తలు రోడ్లపైకి రావటంతో టిడిపి కార్యకర్తలు అడ్డుకున్నారు. దాంతొ ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. రెండు వైపుల నుండి రోడ్లపై దొరికిన రాళ్ళు, రప్పలను తీసుకుని ఒకరిపై మరొకరు విసురుకున్నారు. అదుపు చేయాలని చూసిన పోలీసులకు కూడా గాయాలయ్యాయి. పరిస్ధితి ఎలాగుందో వీడియో చూస్తే మీకే తెలుస్తుంది.

 

loader