Asianet News TeluguAsianet News Telugu

రాజధాని నిర్మాణానికి కేంద్ర నిధులు అనుమానమా?

  • రాజధాని నిర్మాణానికి బాండ్లను సమీకరించాలని నిర్ణయించింది.
  • అమరావతి నిర్మాణానికి రూ. 2 వేల కోట్ల సమీకరణకు సిఆర్డిఏ సొంత ఏర్పాట్లు చేసుకుంటోంది.
  • మొత్తం రూ. 2 వేల కోట్లను బాండ్లు జారీ చేయటం ద్వారా సొంతంగానే సమకూర్చచుకోవాలని సిఆర్డీఏ రంగం సిద్దం చేస్తోంది.
State govt making its own way to rise funds for the capital construction

రాజధాని నిర్మాణానికి కేంద్ర నుండి నిధుల సాయం అందే విషయం సందిగ్దంలో పడిందా? రాష్ట్రప్రభుత్వం తీరు చూస్తుంటే అందరిలోనూ అదే అనుమానం  మొదలైంది. ఎందుకంటే, అమరావతి నిర్మాణానికి రూ. 2 వేల కోట్ల సమీకరణకు సిఆర్డిఏ సొంత ఏర్పాట్లు చేసుకుంటోంది. రాజధాని నిర్మాణానికి బాండ్లను సమీకరించాలని నిర్ణయించింది. మొత్తం రూ. 2 వేల కోట్లను బాండ్లు జారీ చేయటం ద్వారా సొంతంగానే సమకూర్చచుకోవాలని సిఆర్డీఏ రంగం సిద్దం చేస్తోంది. తొలివిడతలో రూ. 500 కోట్లు సమీకరించాలని నిర్ణయించింది. నవంబర్, డిసెంబర మాసాల్లో తొలివిడత బాండ్ల విడుదలకు వీలుగా జేకే క్యాపిటల్ అనే సంస్ధను మర్చెంట్ బ్యాంకర్ ను కూడా నియమించుకున్నది.

మూడేళ్ళక్రితం కేంద్రంలో నరేంద్రమోడి ప్రధానమంత్రి బాధ్యతలు తీసుకున్నప్పటి నుండీ రాష్ట్రానికి ప్రత్యేకంగా సాయం అందిన దాఖలాలు లేవు.  రూ. 16 వేల కోట్ల రెవిన్యూలోటు భర్తీ విషయంలో కూడా తాజాగా కేంద్రం రాష్ట్ర విజ్ఞప్తిని పక్కన పెట్టేసింది. పైగా ఇంతకాలం విషయాన్ని నాన్చిన మోడి సర్కార్ రెవిన్యూలోటు కేవలం రూ. 4 వేల కోట్లేనని తేల్చేయటం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద షాకే. ఇదే కాకుండా పోలవరం అంచనా వ్యయాల విషయంలో కూడా రాష్ట్రానికి పెద్ద షాకే ఇచ్చింది. ఇది అది అని లేదు ప్రతీ విషయంలోనూ షాకులే షాకులు.

ఇటువంటి నేపధ్యంలో రాజధాని నిర్మాణానికి కేంద్రం నుండి సాయం అందటంపై అందరిలోనూ ఎన్నో అనుమానాలు. అందులోనూ ఇంతకాలం చంద్రబాబుకు ఢిల్లీలో పెద్ద దిక్కుగా ఉన్న వెంకయ్యనాయుడు కూడా క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకోవాల్సి వచ్చింది. అందుకనే చంద్రబాబు కూడా కేంద్రంపై ఆధారపడితే కష్టమని అనుకున్నట్లున్నారు. అందుకనే నిధుల కోసం సొంత వేట మొదలుపెట్టారు. సరే, ఈ బాండ్లను ఒకేసారి విడుదల చేస్తారా? విడతల వారీగా అవసరాల మేరకు విడుదల చేస్తారా? ఒకరి నుండే సమీకరిస్తారా లేక వివిధ సంస్ధల నుండా అన్న విషయంలో సిఆర్డిఏలోనే ఇంకా స్పష్టత వచ్చినట్లు లేదు.

Follow Us:
Download App:
  • android
  • ios