Asianet News TeluguAsianet News Telugu

టిడిపిని ఓడించాలని అనంతపూర్ లో బిజెపి తీర్మానం

ఉత్తర ప్రదేశ్ మిడిసిపాటో లేక ప్రధాని మోదీ ‘మన్ కి బాత్ ’యో తెలియదు, 2019లో టిడిపిని ఓడించాలని రాప్ట్ర బిజెపి తీర్మానం చేసింది.

state BJP resolves to defeat TDPs Naidu  in Andhra

2019 ఎన్నికల్లో ఆంధ్రోళ్లకు ఉత్తర ప్రదేశ్ కనిపించేలా చేయాలని బిజెపి తీర్మానించింది.

 

చంద్రబాబు నాయుడితో  ఇక  తెగతెంపులు చేసుకుని 2019 ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీచేసి 100 సీట్లు గెల్చి టిడిపిని శంకరగిరి మాన్యాలకు పంపాలని బిజెపి భావిస్తున్నది.

 

ఆంధ్రాలో ఉత్తర ప్రదేశ్   గాలి విస్తావుందని, దీనికి గత వారంలో ఉత్తరాంధ్రలో గెల్చిన ఎమ్మెల్సీ ఎన్నిక యే సాక్ష్యమని  నాయకులంతా కాలరెగేసి చెప్పారు.

 

ఆంధ్రా బిజెపిలో ఉత్తర ప్రదేశ్ ఉత్సాహం భాగా ఎక్కినట్లుంది.  నిన్నఅనంతపురంలో ఏర్పాటు చేసిన  బిజెపి పదాదికారులు సమావేశం మొత్తం ఉత్తర ప్రదేశ్ వూపులోనే  జరిగింది.

 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో 100 సీట్ల సాధనే లక్ష్యంగా పనిచేయాలని ఏకంగా ఒక తీర్మానమే చేసేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు దీనికి రోడ్ మ్యాప్ తయారుచేస్తున్నారట.

 

బిజెపిని ఎట్లా గెలిపించాలో, పోలింగ్ కేంద్రాల స్థాయినుంచే దీనికి ఎలా బాట వేయాలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఏప్రిల్ చివరి వారంలో  స్వయంగా ఒక క్లాస్ తీసుకుంటారు.

 

ఈ క్లాస్ ఎవరోబడా నేతలకు కాదు, బూత్ స్థాయి కార్యకర్తలకు. బిజెపి ఎన్నికల మేనేజ్ మెంట్ గురుగా పేరున్న అమిత్ షా ఇలా ఆంధ్రలో పోలింగ్ బూత్ ల నిర్వహణ మీద శిక్షణ ఇవ్వాలనుకోవడం ఏమిటి... వ్యవహారం సీరియస్ గానే ఉందునుకోవాలి.

 

నిన్నటి సమావేశానికొచ్చిన నాయకులంతా గాలిలో తేలిపోయేలా చేస్తూ, ముఖ్యఅథిది సిద్ధార్థనాథ్ సింగ్ పార్టీ అధ్యక్షుడి సందేశమేమిటో వినిపించారు. ‘2109 ఎన్నికలలో ఆంధ్ర ప్రదేశ్ లో ఉత్తరప్రదేశ్ ప్రత్యక్షం కావాల,’ అనేది అమిత్ షా మాటగా సిద్ధార్థం  నాధ్ సింగ్ చెప్పారు.

 

రాష్ట్రంలో ఉండే అసెంబ్లీ సీట్లు 175. ఇందులో నూరు సీట్ల మీద కన్నేయడమంటే, తెలుగుదేశం పార్టీని ఓడించి అధికారంలోకి రావడమేనా అర్థం. అంటే టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడో, ఆయనకుమారుడు లోకేశ్ నాయుడో ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవడమేనా...

 

బిజెపి సమావేశం ఈ సారి రాయలసీమలోని అనంతపురంలోజరిగింది. మోదీ నాయకత్వంలోపని చేస్తూ టిడిపి తో కలసి ఉండటం రాయలసీమ బిజెపి నాయకులెవరికి ఇష్టంలేదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు దోస్తానా పార్టీని మరుగుజ్జును చేసి టిడిపికి పర్మనెంట్ తోకగా మారుస్తుందని  వారి అనుమానం.నిన్నటి సమావేశంలో చాలా స్పష్టంగా రాయలసీమ నాయకులు తమ అభిప్రాయం వెల్లడించారు. టిడిపి  ప్రజాదరణకోల్పోతున్నదని, ఇక ఆ పార్టీతో ఉంటే మనమూ మునుగుతామని, ఇక బిజెపి స్వతంత్రంగా పనిచేయాలని వారు తెగేసి చెప్పారు.

 

అమిత్ షా సమావేశానికి రంగం సిద్ధం చేస్తూ ఏప్రిల్‌  లో బీజేపీ జాతీయ నాయకులు  రాష్రంలో పర్యటిస్తారు.  

 

ఇది కేవలం ఉత్తర ప్రదేశ్ వూపుతో వచ్చిన బింకమా లేక ప్రధాని నరేంద్రమోదీ మన్ కీ బాతా...

 

ఎందుకంటే,  చంద్రబాబునాయుడు దేవుడు పంపించిన ముఖ్యమంత్రి అని, ఆయన ముఖ్యమంత్రి కావడం తెలుగు ప్రజల అదృష్టమని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. మరి దేవదూతని ఓడిస్తారా...

Follow Us:
Download App:
  • android
  • ios