ఎన్నికల్లో సీట్లు కేటాయించినటే కేటాయించి అక్కడ గెలవకుండా రెబెల్సను టిడిపి నిలబెడుతూ ఉంది దీనితో బిెజెపికి ఎక్కువ సీట్లు కేటాయిస్తే నష్టం  అనే భావం ప్రచారం చేస్తున్నది 2019లో ఈ వ్యవూమే ప్రయోగిస్తే ఎలా బిజెపిలో చర్చ

రాష్ట్రం లో బిజెపి ఎదగకుండా తెలుగు దేశం పార్టీ అడ్డుకుంటున్నదే అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ బిజెపిలో బలంగా నాటుకుంది. పొత్తు పేరుతో సీట్లు కేటాయించి, అక్కడ బిజెపిగెలవకుండా చేసి, ఇంతే బిజెపి ఎక్కువ సీట్లు ఇస్తే గెలవరనే భావం ప్రచారం చేస్తున్నదనే అనుమానం రాష్ట్ర బిజెపి నాయకులలో బలపడుతూ ఉంది. ఇదే వ్యూహం గత ఎన్నికలలో ప్రయోగించారని, మొన్నటికి మొన్న కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలలో కూడా వాడారని బిజెపి అధ్యయనం చేసింది. ఈ విషయం మొన్న మంగళవారం నాడు ఒంగోలు లో జరిగిన పార్టీ పదాది కారుల సమవేశం బాగా చర్చనీయాంశమయింది. 2019 ఎన్నికలలో కూడా తెలుగుదేశం అధినేత ఇదే వ్యూహం ప్రయోగించి ఆంధ్రప్రదేశ్ బిజెపికిబలమేమీ లేదు, వారికి ఎక్కువ సీట్లు ఇస్తే ఒడిపోతారని ప్రచారం చేస్తారని చాలా మంది సమావేశం అభిప్రాయపడ్డారని సీనియర్ నాయకుడొకరు ‘ఏషియానెట్ ’కు తెలిపారు. అందువల్ల 2019 ఎన్నికల్లో ఒంటరి గా పోరాటడమే మంచిదని అభిప్రాయపడ్డారు. దానికి తోడు చీటికి మాటికి ‘175 స్థానాల్లో తెలుగుదేశం గెలుస్తుంది. ఈ లక్ష్యం కోసం కృషి చేయాలి,’ ఒక వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మరొక వైపు లోకేశ్ నాయుడు వూరూర టాం టాం చేయడం కూడా నచ్చడం లేదు. ఈ విషయాన్నిపార్టీ అధిష్టానం దృష్టికి తసుకువెళ్లాని కూడా సమావేశంలో నిర్ణయించారని తెలిసింది.

సమావేశంలో కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల మీద బాగా చర్చ జరిగింది.కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీకి తొమ్మిది స్ధానాలను తెలుగుదేశంపార్టీ అధిష్టానవర్గం కేటాయించింది. అందులో కొన్నిచోట్ల తెలుగుదేశంపార్టీకి చెందినవారినే రెబెల్ అభ్యర్థులుగా పోటీలోకి దించింది. అందువలన పార్టీ అభ్యర్థులు గెలవలేకపోయారని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఈనేపధ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల కచ్చితంగా తెలుగుదేశంపార్టీతో పొత్తు ఉండవచ్చని చెప్పేలేమని కూడా వారు అభిప్రాయపడ్డారు. అయితే, మూడేళ్లు కలసి ఉన్నా బిజెపి-తెలుగుదేశం పార్టీల మధ్య సఖ్యత పెరగలేదని, జిల్లాలలో తెలుగుదేశం నేతలు బిజెపి వారిని దరిదాపుల్లోకి రానీయడం లేదని కూడా సమావేశం దృష్టికి వచ్చింది.

ఈరాష్టస్ధ్రాయి పదాధికారుల సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, అఖిలభారత పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి సతీష్‌జి, రాష్టమ్రంత్రులు కామినేని శ్రీనివాస్, పి మాణిక్యాలరావు, కేంద్రమాజీ మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి, పార్లమెంటుసభ్యులు జి గంగరాజు, ఎంఎల్‌సిలు సోము వీర్రాజు, సత్యనారాయణ, మాధవ, శాసనసభ్యులు విష్ణుకుమార్‌రాజు, ఆకుల సత్యనారాయణ, రాష్టప్రార్టీ నాయకులు కన్నా లక్ష్మినారాయణ, కావూరి సాంబశివరావు, ప్రకాశం జిల్లాపార్టీఅధ్యక్షులు పివి కృష్ణారెడ్డితోపాటు, 13జిల్లాల పార్టీ అధ్యక్ష,ప్రధానకార్యదర్శులు పాల్గొన్నారు.