రాష్ట్రంలో ప్రభుత్వ కోవిద్ ఆసుపత్రుల్లో మెరుగైన చికిత్సలు అందించాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు భాజపా చీఫ్ సోము వీర్రాజు లేఖ రాశారు. 

కోవిద్ వ్యాధి నిరోధానికి, అదుపుకు. చికిత్సకలకు రూ.2 వేల కోట్లు అత్యవసరంగా విడుదల చేయాలని భాజపా చేసిన సూచనలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన శూన్యం అని ఆ లేఖలో రాశారు.

తిరుపతి, విశాఖ ఆసుపుత్రుల్లో మందుల, కిట్స్ కొరత ఉందని,  తిరుపతిలో కలెక్టరు, మంత్రిని కలసి మందులు అందుబాటులో ఉంచాలని భాపా విజ్ఞప్తి చేసిందన్నారు.

ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీకి ఇవ్వాల్సిన బిల్లులు పెండింగ్లో ఉన్నా, కోవిద్ చికిత్సలు చేయాలని రాష్ట్రప్రభుత్వం కోరింది. చెల్లించాల్సిన ఆరోగ్యశ్రీ బిల్లుల వల్ల కోవిద్ చికిత్సకలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా రోజువారిగా పరిశీలించి ఆసుపత్రులకు బిల్లులు చెల్లించాలని కోరారు.

రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో కోవిడ్ మీద సరైన అవగాహన లేక వైద్యం అందడం లేదు. గిరిజనులు డయేరియా, చలిజ్వరాలు, విషజ్వరాలపై వైద్యం చేయించుకోడానికి ముందుకు రాని విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం గిరిజన ప్రాంతాలపై ప్రభుత్వం ప్రత్యేకశ్రద్ధ కనబరచాలన్నారు.

ప్రభుత్వం 4 అంశాలపై చొరవ చూపాలని వాటిని వివరించారు. 

1) ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటుచేయడం, 
2) రెమివిర్ ఇంజక్షన్లు సొంతగా సమకూ ర్చుకోవడం
3) ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, బెడ్లు పెంచేలా చర్యలు తీసుకోవడం
4) విశాఖలోని జీహెచ్, విమ్స్, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెంటిలేటర్లు, వైద్యులు ఉన్నా నిర్వహణకు నిధులు కేటాయించకపోవడం వల్ల రోగులకు సరైన సేవలు లభించడం లేదు. ఈ ఆసుపత్రులపై నిపుణులతో అధ్యయనం చేయించి యుద్ధప్రాతిపదికన మెరుగైన చికిత్సలు అందేలా చూడాలి.

ఆక్సిజన్ ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటుచేసుకునేందుకు ప్రైవేటు మెడికల్ కళాశా లలు ముందుకు వస్తే ప్రభుత్వం ప్రోత్సహించాలి. అలాగే ఆక్సిజన్ యూనిట్లు, మందులు, రెమిడిసివిల్ ఇంజక్షన్లు, వ్యాక్సినేషన్లు కేంద్రం ఇస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా వీటిని సొంతగా సేకరిస్తేనే వైద్యం అందరికీ అందుతుంది. రాష్ట్రంలో కర్ఫ్యూ విధించినా కేసులు, మరణాలు పెరుగుతున్నాయన్నారు.

ఒకటో వేవ్తో పోలిస్తే గ్రామాల్లో, పోలీసు చర్యలు సరిగా లేవు. అందువల్ల మరింత సమర్ధవంతంగా అమలుచేయాలి. కోవిడ్ వ్యాక్సిన్ లు కూడా ప్రభుత్వం తరపున ఆర్డర్లు పెట్టి అందరికి సత్వరమే అందేలా చూడాలని కోరుతున్నామన్నారు.