చంద్రబాబునాయుడుకే ముహూర్తబలం బాగా లేదా? అందుకే మూడున్నరేళ్ళల్లో అనర్ధాలు జరగటం, అనుకున్ని, జరగాల్సినవేవీ జరగటం లేదని పంచాగకర్తలు చెబుతున్నారు. అసలు ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న ముహూర్తమే మంచిది కాదని అప్పట్లో పెద్ద వివాదం రేగిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పటి నుండి ఏది జరిగినా, ఏది చేద్దామన్న అవరోధాలే.
చంద్రబాబునాయుడుకే ముహూర్తబలం బాగా లేదా? అందుకే మూడున్నరేళ్ళల్లో అనర్ధాలు జరగటం, అనుకున్ని, జరగాల్సినవేవీ జరగటం లేదని పంచాగకర్తలు చెబుతున్నారు. అసలు ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న ముహూర్తమే మంచిది కాదని అప్పట్లో పెద్ద వివాదం రేగిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పటి నుండి ఏది జరిగినా, ఏది చేద్దామన్న అవరోధాలే. జరుగుతున్న వాటికి, చంద్రబాబుకు ప్రత్యక్షంగా ఏమీ సంబంధాలు లేకపోయినా ముఖ్యమంత్రి కాబట్టి రాష్ట్రానికి జరిగే ప్రతీ లాభ, నష్టానికి చంద్రబాబే బాధ్యత వహించక తప్పదు.
గతంలో లేదుకానీ మూడోసారి ముఖ్యమంత్రైన దగ్గర నుండి ప్రతీ చిన్న విషయానికీ చంద్రబాబు ముహూర్తాలు, వాస్తుకు బాగా ప్రధాన్యత ఇస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. అందువల్లే సిఎంగా బాధ్యతలు తీసుకున్న ముహూర్తం కూడా కాంట్రవర్సీ అయ్యింది. సరే, అదేదో అయిపోయిందనుకుంటే, హైదరాబాద్ సచివాలయంలో బాధ్యతలు తీసుకున్న ముహూర్తంపైన కూడా వివాదాలే. ముందుగా నార్త్ హెచ్ బ్లాక్ రెడీ చేసారు. చివరి నిముషంలో వాస్తు బాగాలేదని చెప్పి సిఎం కార్యాలయాన్ని ఎల్ బ్లాకులోని 8వ అంతస్తుకు మార్చారు. సరే, వాస్తు దోషాలు, పూజలు షరామామూలే అనుకోండి. వాస్తు దోషాలు సరిచేసినా, పూజలు చేయించినా చంద్రబాబున్నది ఎల్ బ్లాకులో మహా అయితే 8 మాసాలు మాత్రమే.
సరే, తర్వాత విజయవాడకు చేరుకున్నారు. అమరావతి నిర్మాణమన్నారు. నూతన రాజధాని అని ఊదరగొట్టారు. చివరకు ఓ మంచి ముహూర్తం చూసుకుని రాజధానికి శంకుస్ధాపన చేసారు. తీరా చూస్తే ఆ ముహూర్తం కూడా మంచిదికాదంటూ వివాదాలు మొదలయ్యాయి. రెండేళ్ళ క్రితం చేసిన శంకుస్ధాపన చేసిన తర్వాత ఇప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవటానికి కారణం అప్పటి తప్పుడు ముహూర్తమే కారణమని అంటున్నారు. అదే సమయంలో గోదావరి పుష్కరాలు మొదలయ్యాయి. మంచి ముహూర్తం చూసుకునే పూజలు చేసి ప్రారంభించారు. ఇంకేముంది? అదే సమయంలో జరిగిన తొక్కిసలాటలో 29 మంది మరణించారు.
సరే, రాజధాని నిర్మాణానికి ఎంత సమయం పడుతుందో ఏమో అనుకుని సచివాలయం, అసెంబ్లీ పేరుతో తాత్కాలిక భవనాలు నిర్మించారు. అవి నిర్మించిన దగ్గర నుండి ఒకటే వివాదాలు. చిన్నపాటి వర్షానికీ భారీ లీకేజలను అందరూ చూసిందే. వాస్తు పేరుతో ఒకటికి పదిసార్లు కొట్టడం, కట్టడమే. ఇక, ప్రస్తుత విషయానికి వస్తే, ఏ ముహూర్తంలో తాను రాజధాని నిర్మాణానికి భూమిపూజ చేసారో అప్పటి నుండి వరుసబెట్టి శంకుస్ధాపనలైతే జరుగుతున్నాయి కానీ అడుగు ముందుకు పడటం లేదు. ప్రధానంగా చేతిలో డబ్బు లేదు. ఆదుకోవాల్సిన కేంద్రం పట్టించుకోవటం లేదు. ఏ రకంగా చూసినా రాజధాని నిర్మాణం మొదలయ్యే సూచనలే కనబడటం లేదు.
