AP SSC Exam Pattern: కరోనా నేపథ్యంలో ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు..  ఏడు పేపర్లతో పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణ‌యించింది.. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకూ ఏడు పేపర్లే ఉంటాయి. సైన్స్ స‌బ్జెక్ట్  మినహా మిగతా అన్ని సబ్జెక్టులకూ ఒకే పేపర్‌ ఉంటుంది. మొత్తం 33 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. అలాగే.. ప‌రీక్ష స‌మయాన్ని 3.15 గంటలకు పెంచింది. 

AP SSC Exam Pattern: ఏపీ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పదో తరగతి పరీక్షల నిర్వహణలో మార్పులు చేసింది. విద్యార్దుల పైన మానసిక ఒత్తిడి తగ్గించేందుకు పదో తరగతిలో ఏడు పేపర్లతో పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా పదో తరగతి విద్యార్ధుల పరీక్షలను 11 పేపర్లతో నిర్వహిస్తారు. కానీ, గ‌తేడాది..కరోనా కాలంలో అమలు చేసిన విధంగానే ఈ ఏడాది కూడా పరీక్షా పేపర్ల సంఖ్య ను 7 కు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

వచ్చే మార్చిలో జరగనున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలను 11 పేపర్లకు బదులు 7 పేపర్లలో నిర్వహించాలని నిర్ణ‌యించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌ శుక్రవారం జీవో నంబర్‌ 79ను విడుదల చేశారు. సప్లిమెంటరీ పరీక్షలు రాసే వారు కూడా ఏడు పేపర్లే ఉంటాయి. సామాన్య శాస్త్రం మినహా మిగతా అన్ని సబ్జెక్టులకూ ఒకే పేపర్‌ ఉంటుంది. మొత్తం 33 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి.

Read Also: US report on terrorism: తీవ్రవాదానికి పాకిస్థాన్ స్వర్గధామం

సామాన్య శాస్త్రంలో భౌతిక, రసాయన శాస్త్రాలు ఒకటిగా, జీవశాస్త్రం పేపర్లు ఒకటిగా 50 చొప్పున మార్కులకు ఇస్తారు. అలాగే ప‌రీక్ష స‌మయాన్నికూడా 3.15 గంటల పెంచింది. ఏడు పేపర్ల విధానాన్ని ఈ ఒక్క ఏడాదే అమలు చేయనున్నారు. 2023 మార్చి నుంచి 11 పేపర్ల విధానం అమల్లోకి వస్తుంది.

Read Also: బార్డ‌ర్ మార్కుల‌తో ఇంట‌ర్ విద్యార్థులు పాస్‌ ? ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో తెలంగాణ విద్యాశాఖ యోచ‌న‌..

గత ఏడాది ఇదే విధంగా 2020-21లో కూడా ప‌దోత‌ర‌గ‌తి వారికి 7 పరీక్షలే కుదించారు. కానీ నిర్వహించలేక విద్యార్థులను ఆల్‌పాస్‌గా పేర్కొన్నారు. అయితే.. వారి పైచదువులకు, ఉద్యోగాలకు ఇబ్బంది రాకుండా ఇంట‌ర్న‌ల్ పరీక్ష‌ల ఆధారంగా గ్రేడ్లు ప్రకటించారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఛాయారతన్‌ నేతృత్వంలోని హైపవర్‌ కమిటీ సిఫార్సుల మేరకు టెన్త్, ఇంటర్‌ విద్యార్థులకు ఇలా ఇంట‌ర్న‌ల్ ప‌రీక్ష‌ల ఆధారంగా.. గ్రేడ్లు కేటాయించారు.

Read Also: మూఢనమ్మకం : పెళ్లైన 42 రోజులకే భార్యను అతికిరాతకంగా చంపిన భర్త.. కాళ్లకు తాడు కట్టి.. ఛాతిపై వాతలు పెట్టి..

2020లో 6,37,354 మంది, 2021లో 6,26,981 మంది టెన్త్‌ విద్యార్థులకు ఉత్తీర‌ణ సాధించారు. ఇక ఈ ఏడాది (2021-22 విద్యాసంవత్సరం)లో టెన్త్‌ పరీక్షలకు 6 లక్షల మందికి పైగా హాజరుకానున్నారు. ఇక, ఇదే సమయంలో ఇంటర్‌ పరీక్షల కోసం ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 23 వరకు ఇస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు సర్క్యులర్‌ జారీచేశారు.