Asianet News TeluguAsianet News Telugu

బార్డ‌ర్ మార్కుల‌తో ఇంట‌ర్ విద్యార్థులు పాస్‌ ? ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో తెలంగాణ విద్యాశాఖ యోచ‌న‌..

ఇంటర్ లో ఫెయిలైన స్డూడెంట్లను పాస్ చేయాలని డిమాండ్లు వస్తుండటంతో ప్రభుత్వం  ఆ దిశగా  ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలంగాణ విద్యాశాఖ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లింది. ఈ విష‌యంలో నేడు సీఎం నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది. 

Do Inter students pass with Border Marks? Telangana education department plans in the wake of concerns ..
Author
Hyderabad, First Published Dec 18, 2021, 10:39 AM IST

రెండు రోజుల క్రితం ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ఎగ్జామ్ రిజల్ట్స్ వ‌చ్చాయి. ఈ ఫ‌లితాలు చూసి స్టూడెంట్స్, పేరెంట్స్ ఒక్క సారిగా కంగుతిన్నారు. గ‌డిచిన కొన్నేళ్ల‌లో ఇలాంటి దారుణ‌మైన ఫ‌లితాలు ఎప్పుడూ రాలేదు. కింద‌టి ఏడాది ఫ‌లితాల‌తో పోలిస్తే ఏకంగా 11 శాతం తగ్గిపోవ‌డం ఆందోళ‌న క‌లిగించే విష‌యం.  ఈ సారి ఏ ఒక్క స్టూడెంట్ వంద శాతం మార్కులు సాధించ‌లేదు. పాసైన చాలా మంది స్టూడెంట్స్ ఫ‌లితాలు అంత గొప్ప‌గా ఏం లేవు. చాలా మంది బార్డ‌ర్ మార్కుల‌తోనే గ‌ట్టేక్కారు. ఫెల‌యిన స్టూడెంట్ల నుంచి ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతుండ‌టం, ఓ ఇద్ద‌రు విద్యార్థులు సూసైడ్ చేసుకోవ‌డంతో.. ఫ‌లితాల విష‌యంలో ప్ర‌భుత్వం ఓ నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్టు తెలుస్తోంది. 

ఈ ఒక్క‌సారికి ఛాన్స్‌..
ఇంట‌ర్ ఫ‌లితాలు నిరాశ ప‌ర్చ‌డంతో చాలా మంది విద్యార్థుల త‌ల్లిదండ్రుల నుంచి వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మవుతోంది. లాక్‌డౌన్, ఆన్‌లైన్ క్లాసుల వ‌ల్ల విద్యార్థులు స‌దువు అంతంత మాత్రంగానే సాగింది. దీంతో ఫ‌లితాలు కూడా ఆ విధంగానే వ‌చ్చాయి. ఫ‌లితాలు వెలువ‌డిన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఇద్ద‌రు స్టూడెంట్లు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. దీంతో విద్యార్థి సంఘాలు శుక్ర‌వారం నాడు ఆందోళ‌న నిర్వ‌హించాయి. ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ ఆధ్వ‌ర్యంలో స్టూడెంట్లు నిర‌స‌న చేప‌ట్టారు. ఇంట‌ర్ బోర్డును ముట్ట‌డించేందుకు ప్ర‌య‌త్నించారు. ఇంట‌ర్ లో ఫెయిలైన స్డూడెంట్లంద‌రినీ పాస్ చేయాల‌ని డిమాండ్ చేశారు. ఆత్మ‌హ‌త్య చేసుకున్న స్డూడెంట్ల కుటుంబాలకు న్యాయం చేయాల‌ని కోరారు. అంద‌రినీ పాస్ చేయ‌క‌పోతే మ‌రింత మంది స్టూడెంట్లు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌భుత్వానికి విన్న‌విచారు. 
ఈ విష‌యంలో తెలంగాణ ఇంట‌ర్ బోర్డు కూడా సుముఖంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ ఒక్క సారికి ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్‌లో ఫెయిలైన స్టూడెంట్లంద‌రినీ పాస్ చేయాల‌ని ఆలోచిస్తోంది. క‌నీసం వారికి బార్డ‌ర్ మార్కులు వేయాల‌ని చూస్తోంది. ఈ ప్ర‌తిపాద‌న‌ను విద్యాశాఖ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లిన‌ట్టు అర్థ‌మవుతోంది.  ఆన్‌లైన్ చ‌దువులు, లాక్ డౌన్ ల వ‌ల్ల స్డూడెంట్ల చ‌దువులు స‌రిగా సాగ‌లేదు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌భుత్వం ఇంట‌ర్ స్టూడెంట్ల‌పై కాస్త పాజిటివ్ గానే స్పందిస్తుంద‌ని అర్థ‌మ‌వుతోంద‌. ఈ విష‌యంలో దాదాపుగా ఈరోజు నిర్ణ‌యం వెలువ‌డే అవ‌కాశం ఉంది. 

తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత: విద్యార్ధి సంఘ నేతల అరెస్ట్

మొద‌ట్లో ప్ర‌మోట్‌.. త‌రువాత ఎగ్జామ్స్‌
ఇప్పుడు ఇంట‌ర్ ఫస్టియ‌ర్ ప‌రీక్ష‌లు రాసిన స్డూడెంట్ల చ‌దువులు మొద‌టి నుంచీ గంద‌ర‌గోళంగానే ఉన్నాయి. వీరు ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్న స‌మ‌యంలోనే ఇండియాలోకి క‌రోనా వైర‌స్ ప్ర‌వేశించింది. బోర్డు ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ పెట్టారు. దీంతో వీరి ప‌రీక్ష‌లు వాయిదా వేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అయితే మ‌ళ్లీ ప‌రీక్షలు నిర్వ‌హించే అవ‌కాశం లేక‌పోవ‌డంతో వీరిని డైరెక్ట్‌గా ప్ర‌మోట్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. వీరు ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్‌లోకి అడ్మిష‌న్ తీసుకున్న చాలా రోజుల వ‌ర‌కు కూడా క‌రోనా వ‌ల్ల క్లాసులు నిర్వ‌హించ‌లేదు. చివ‌రికి లాక్ డౌన్ ఎత్తేసి ప‌రిస్థితులు కొంత స‌ద్దుమ‌ణిగాక‌.. వీరిని కాలేజ్‌కి పిలిచి క్లాసులు చెప్పారు. కొంత కాలం త‌రువాతే భార‌త్ లోకి సెకెండ్ వేవ్ ప్ర‌వేశించ‌డంతో మ‌ళ్లీ విద్యాసంస్థ‌ల‌న్నీ మూసివేస్తున్నామ‌ని తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఆన్‌లైన్ క్లాసులు ద్వారా చ‌దువు కొన‌సాగించాల‌ని స్టూడెంట్ల‌కు, కాలేజీ మేనేజ్‌మెంట్ల‌కు సూచించింది. చాలా మంది స్టూడెంట్ల వ‌ద్ద స‌రైన సెల్‌ఫోన్లు, ఇంట‌ర్నెట్ సౌక‌ర్యం లేక‌పోవ‌డంతో వారి చ‌దువు అంతంత మాత్రంగానే సాగింది. అయితే వీరికి  మార్చిలో ప‌రీక్ష‌లు నిర్వ‌హించే అవ‌కాశం లేక‌పోవ‌డంతో ఫ‌స్టియ‌ర్ నుంచి సెకెండియ‌ర్‌కు ప్ర‌మోట్ చేశారు. అయితే అంద‌రూ స్డూడెంట్లు దాదాపు ఇక ప‌రీక్ష‌లు ఉండ‌వ‌నే అనుకున్నారు. సెకండియ‌ర్ ప‌రీక్ష‌ల‌పైనే దృష్టి పెట్టారు. కానీ విద్యార్థులకు భవిష్య‌త్తులో ఉన్న‌త చ‌దువుల కోసం, ఉద్యోగాల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునే స‌మ‌యంలో ఇబ్బందులు ఎదురవుతాయ‌నే ఉద్దేశంతో ప్ర‌భుత్వం ప‌రీక్షలు నిర్వ‌హించింది. అయితే నామ మాత్రంగా ప‌రీక్ష‌లు నిర్వహించి, దాదాపుగా అధిక శాతం మంది  స్డూడెంట్ల‌ను పాస్ చేస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ అలా జ‌ర‌గ‌లేదు. ప‌రీక్ష ఫ‌లితాలు చాలా భిన్నంగా వ‌చ్చాయి. దీంతో చాలా మంది ఫెయిల్ అయ్యారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios